EPAPER

BRS MLA Tellam Venkata Rao: బీఆర్ఎస్‌కు మరో షాక్ ..! కాంగ్రెస్‌లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే ..?

BRS MLA Tellam Venkata Rao: బీఆర్ఎస్‌కు మరో షాక్ ..!  కాంగ్రెస్‌లో చేరనున్న భద్రాచలం ఎమ్మెల్యే ..?
tellam venkata Rao
BRS MLA Tellam Venkata Rao

Bhadrachalam MLA Tellam Venkata Rao: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కారుకి బై బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరునున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో.. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ నుంచి తెల్లం గెలుపొందారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారంతో ఖమ్మం జిల్లాలో కారు పార్టీ పని ఖతం అయినట్టే అని అంటున్నారు.


తెల్లం వెంకట్రావుకు మొదటి నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా పేరు ఉంది. అయితే భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు కాంగ్రెస్ మళ్లీ ఛాన్స్ ఇవ్వడంతో.. తెల్లం బీఆర్ఎస్ పార్టీలో చేరి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే మారుతున్న సమీకరణాల రీత్యా తిరిగి కాంగ్రెస్ లో చేరతారని టాక్ కొద్దిరోజులుగా నడుస్తోంది. అయితే పార్టీ మార్పుపై వెంకట్రావుకు ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి దాటవేసే ధోరణి అవలంబిస్తూ వచ్చారే కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఇక ఇటీవల రెండుసార్లు కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉండి కూడా తెల్లం సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఎమ్మెల్యే త్వరలో పార్టీ మారతారనే వార్తలకు బలం చేకూరింది. మంగళవారం ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి తెల్లం హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 5 లేదా 6న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని సన్నిహితులు అంటున్నారు.


Also Read: బక్క జడ్సన్‌పై సస్పెన్షన్ వేటు..

ఈనెల 5న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఆ రోజు చేరకుంటే ఏప్రిల్ 6న కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ పాల్గొనబోతున్న తుక్కుగూడ బహిరంగ సమావేశంలో చేరే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×