EPAPER

Breaking : ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల హై అలర్ట్..

Breaking : ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. సిద్దిపేట జిల్లాలో పోలీసుల హై అలర్ట్..

Breaking :


మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టిన క్రమంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ నుంచి బయటకు వస్తుండగా ఎంపీపై ఒక్కసారిగా దాడి జరిగింది.

కరచాలనం చేసేందుకు వచ్చిన దట్టని రాజు అనే వ్యక్తి కత్తితో ఒక్కసారిగా కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశాడు. దీంతో ఆయనకు పొట్టభాగంలో రక్తస్రావమైంది. వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీని గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు.


కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిన మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఎంపీపై దాడి తర్వాత నిందితుడికి బీఆర్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు కోసం రాజు తీవ్రంగా ప్రయత్నించాడని ఇంకా మంజూరు కాలేదని అంటున్నారు. ఆ ఆవేదనతోనే ఎంపీపై దాడి చేశాడని ప్రచారం జరుగుతోంది.

దాడిలో గాయపడ్డ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని తొలుత గజ్వేల్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నారాయణఖేడ్‌ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు ఎంపీపై దాడి విషయం తెలిసింది. దీంతో హరీష్ రావు గజ్వేల్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులను ఫోన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపాలని డీజీపీని ఆదేశించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని గవర్నర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రచారం చేసే నాయకుల వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ విధించారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరగడంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతే కాదు ఇప్పటికే కత్తితో దాడి చేసిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో విచారణ కూడా వేగవంతం చేశారు. ప్రస్తుతం దుబ్బాకలో గులాబీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పట్టిష్ట బందోబస్తు చేశారు. అంతే కాదు ప్రధాన పార్టీలు ప్రచారాలు వాయిదా వేసుకోవాలని పోలీసుల సూచిస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల ప్రచార వాహనాలను పోలీస్ స్టేషన్ లో భద్రపరచాలని సూచించారు. మరోవైపు దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరిక జారీ చేశారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×