EPAPER

Bore Water Without Current: కరెంట్‌, మోటార్‌ లేకుండానే ఉప్పొంగుతున్న జలం.. ఎక్కడో తెలుసా?

Bore Water Without Current: కరెంట్‌, మోటార్‌ లేకుండానే ఉప్పొంగుతున్న జలం.. ఎక్కడో తెలుసా?

Bore Water Without Current in Mahabubabad District: కరెంట్‌ లేదు.. మోటార్‌ అవసరమే లేదు.. నిరంతరం సమృద్ధిగా నిరిచ్చే బోరు బావి ఎక్కడైనా చూశారా..? చూడలేదు కదూ.. వింత కాదు, ఇది నిజం.. మహబూబబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం శివారులోనీ రైతు పంటపొలంలో భూగర్భ జలం ఉబికి పైకి వచ్చి ప్రవహిస్తోంది. కరెంటు మోటార్ల అవసరం లేకుండానే బోర్లు పొంగి పొర్లుతున్నాయి.


గడిచిన మూడు నెలలుగా వర్షాలు సమృద్దిగా కురుస్తుండటంతో భూగర్బజలాలు పెరిగాయి. బోరు పైపులను చీల్చుకుంటూ నీళ్ళు బయటకు వచ్చే ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఇక్కడ సాధారణంగా మారాయి. 200 ఫీట్ల లోతు తవ్విన బోరు, మోటార్ అవసరం లేకుండానే పొంగి పొర్లుతోంది. ఈ ఒక్క బోరు కింద దాదాపు 10 ఎకరాలకు పైగా పొలం సాగు అవుతోంది. కరెంటు, మోటార్ ఉన్నా కూడా.. ఆ రైతు రెండు వారాలుగా మోటార్ ఆన్ చేయలేదు. ఇలా కరెంటు అవసరం లేకుండానే తమ పొలాలను బోరు బావి సస్యశ్యామలం చేయడం పట్ల ఇక్కడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అటవీ ప్రాంతం కాబట్టి, చెట్లు ఎక్కువగా ఉండటం, సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు.

Also Read: పరిశ్రమలు నెలకొల్పేందుకు.. ముందుకు వచ్చే యువతకు రుణాలు: భట్టి విక్రమార్క


అప్పుడెప్పుడో తాతల కాలంలో లోతు బావి తవ్వితే చాలు పాతాళ గంగ ఉబికి పైకి వచ్చేదంట. కాలక్రమేణా బావుల సంగతి దేవుడెరుగు వందల ఫీట్ల బోరు బావులు తవ్వించినా గుక్కెడు నీటి జాడ కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం గంగారం మండల వాసులు మాత్రం పూర్వీకులు చెప్పినట్టు పాతాళ గంగ ఉబికి పైకి రావడాన్ని స్వయంగా చూస్తున్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×