EPAPER

Booster Dose: బూస్టర్ డోస్‌తో లాభమెంత? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత?

Booster Dose: బూస్టర్ డోస్‌తో లాభమెంత? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత?
covid-booster-dose

Booster Dose: ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో మరోసారి కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గతేడాది ఒమిక్రాన్ వేరియంట్ భయపెడితే.. ఇప్పుడు XBB 1.16 వేరియంట్ ఎఫెక్ట్ కనిపిస్తోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ప్రతి ఏడాది ఎండాకాలం టైంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడు కూడా కొత్త వేరియంట్ రూపంలో ఇండియాపై ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సహా మెట్రోపాలిటన్ సిటీస్ లో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. పాజిటివిటీ రేటు కొన్ని చోట్ల 20 శాతానికి పైనే ఉంటోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రేటు కంటే చాలా ఎక్కువ. ఎక్కడైతే పాజిటివిటీ రేటు 5 శాతానికి మించి ఉంటే అక్కడ అలర్ట్ అవ్వాలని, వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలని WHO చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు కరోనా విజృంభిస్తుండడం, దేశంలో రోజుకు 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఇప్పటి వరకు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటిపోయింది.


కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. అయితే, బూస్టర్ డోసుపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సైడ్ ఎఫెక్టుల భయం కొందరిలో ఉంటే.. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరమా? అనే భావన మరికొందరిది.

బూస్టర్ డోస్‌తో అంతగా ప్రయోజనం ఉండదని ఎయిమ్స్ డాక్టర్ సంజయ్‌రాయ్‌ అభిప్రాయపడ్డారు. RNA వైరస్‌లో మ్యుటేషన్ కారణంగా, కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంతమాత్రాన భయాపడాల్సిన అవసరంలేదని అన్నారు. కొత్త వేరియంట్‌ల బారిన పడే వ్యక్తులు కొత్త రోగనిరోధక శక్తిని పొందుతారని అన్నారు.


కొవిడ్ ప్రారంభ దశలో ప్రజలకు రోగనిరోధక శక్తి లేదు. అప్పుడు వారికి వ్యాక్సిన్లు అవసరం. కానీ ఇప్పుడు దేశంలోని ప్రజలందరికీ కొవిడ్ సోకింది. ఆ తర్వాత సహజ రోగనిరోధక శక్తి పెరిగింది. వ్యాక్సిన్ కంటే వైరస్ నుంచి రక్షించడంలో రోగనిరోధక శక్తి మరింత మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించేందుకు స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల మరింత హాని జరిగే అవకాశముందని తెలిపారు.

ప్రస్తుతం కరోనా, ఇన్‌ఫ్లూయెంజా రెండూ వ్యాప్తి చెందుతున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది సీజన్ ప్రకారం ప్రతి ఏడాది వస్తోందని అన్నారు. దీనిపై టీకా బూస్టర్ మోతాదు ఎంత ప్రభావం చూపుతోందనే దానిపై ఎలాంటి పరిశోధనలు తెరపైకి రాలేదు. సాధ్యాసాధ్యాల ఆధారంగా మాత్రమే, బూస్టర్ డోస్ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పలేమని అన్నారు.

పరీక్షల సంఖ్య పెంచుతున్నకొద్దీ కొవిడ్ కేసులూ పెరుగుతుంటాయని.. ఆస్పత్రుల్లో చేరడం, తీవ్రత పెరగకుండా ఉండడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అయితే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×