EPAPER

CRPF Schools Bomb Threat: సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆపై పోలీసుల టెన్షన్, చివరకు

CRPF Schools Bomb Threat:  సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆపై పోలీసుల టెన్షన్, చివరకు

CRPF Schools Bomb Threat: దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ వ్యవహారం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకప్పుడు హస్తినకే పరిమితమైన ఈ తరహా బెదిరింపులు, క్రమంగా మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తోంది. కేంద్ర స్థాయి సంస్థలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. లేటెస్ట్‌గా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.


ఇందులో భాగంగా హైదరాబాద్ ఉదయం జవహర్‌నగర్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలల్లో మంగళవారం ఉదయం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. పాఠశాల పిల్లలను, సిబ్బంది క్షేమంగా వారి వారి ఇళ్లకు తరలించారు. అనంతరం తనిఖీలు ముమ్మరం చేసింది.

స్కూల్ లోపలకు ఎవరినీ రాకుండా కట్టదిట్ట భద్రత చేశారు పోలీసులు. సీఆర్‌పీఎఫ్‌ అధికారులు, రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ ఆయా ప్రాంతానికి చేరుకుని పరిశీంచారు. బాంబు బెదిరింపులు, మెయిల్స్ రావడంపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు.


కరెక్టుగా విధులు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. రెండు నెలల కిందట ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. స్కూల్, హాస్పటల్, ఎయిర్‌పోర్టులను వదల్లేదు ఆకతాయులు.

ALSO READ: కుక్కను తరుముతూ.. 3వ అంతస్తుపై నుంచి పడ్డ యువకుడు, ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్

మరోవైపు దేశవ్యాప్తంగా విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. దీంతో విమానాలను క్షుణ్నంగా తనిఖీలు చేయించి పంపిస్తున్నారు. గడిచిన వారంలో 120కి పైగానే విమానాల సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Related News

Gangareddy Murder Case: ఆ వీడియోలో ఉన్నది హంతకుడేనా.. గంగారెడ్డి హత్య కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన పోలీసులు.. కారణం అదేనా?

Young Man Death: కుక్కను తరుముతూ.. 3వ అంతస్తుపై నుంచి పడ్డ యువకుడు, ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్

Jagtial Congress Leader Murder: కారుతో గుద్ది, కత్తితో పొడిచి.. కాంగ్రెస్ నేత దారుణ హత్య

KTR on Konda Surekha: మళ్లీ అదే అంశంపై కేటీఆర్ లొల్లి.. జనం మరిచిపోయారనా?

Hydra Issues Notice: హైడ్రా స్పీడ్.. నిర్మాణదారులకు నోటీసులెందుకు?

Kacheguda Railway Station: గులాబీ రంగులో మెరిసిన.. కాచిగూడ రైల్వేస్టేషన్.. కారణం మీరనుకున్నది కాదు కానీ..?

Big Stories

×