EPAPER

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

Hyderabad: తన కుటుంబ సభ్యులనే ఎవరికీ అనుమానం రాకుండా.. చేతబడి సాయంతో హతం చేయాలని భావించింది ఈ మహిళ. మూఢ నమ్మకాలపై ఎక్కువగా నమ్మకం గల ఈ మహిళ, అనుకున్నదే తడవు ఓ బాబాను కలిసింది. ఇంకేముంది పని అయిపోయింది.. ఇక ఖేల్ ఖతం అనుకొని ఆనందించే లోగా.. కుటుంబీకులు అలాగే ఆరోగ్యంగా ఉన్నారు. అరెరె.. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందంటూ ఆ మహిళ.. చివరికి బురిడీ బాబాను పోలీసులకు పట్టించింది. ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా… హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడలో …


స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
పాతబస్తీ లోని బండ్లగూడకు చెందిన ఓ మహిళ … తన అత్త మామల అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. తాను చంపితే.. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే కుటుంబ పరువు పోతుంది. అందుకని ఆమె తన చేతికి మట్టి అంటకుండా.. హతమార్చాలని భావించింది. ఇలా ఆలోచలో ఉన్న ఆమెకు ఒక రోజు సూపర్ ఐడియా తట్టింది… అదే చేతబడి.

అత్తమామను పై లోకానికి పంపేందుకు చేతబడికి మించిన ఆయుధం లేదనుకుంది. ఇక రోజూ చేతబడి చేయగల సామర్థ్యం గల బాబా ఎవరున్నారు అంటూ ఆమె వాకబు చేసింది. చివరకు బాబా మహ్మద్ ఖలీంను ఆశ్రయించింది. అసలు విషయం చెప్పింది. ఈ బాబా కూడా మాయమాటలు చెప్పి ఎలాగైనా మహిళ వద్ద డబ్బు కాజేయాలని అనుకున్నాడు. నేనుండగా.. నీకెందుకు బెంగ అంటూ.. ఆమెకు హామీ ఇచ్చాడు.


అందుకు కొంత నగదు ఖర్చవుతుందని తెలుపగా.. ఆమె ఆ డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఇక నీ పని అయిపోయినట్లే అంటూ బాబా హామీ ఇచ్చేశాడు. తాను అనుకున్న పని తన చేతికి మట్టి అంటకుండా అయిపోతుందని సదరు మహిళ సంబర పడింది. రోజులు గడుస్తున్నాయి కానీ.. అత్తమామ ఆరోగ్యంగా ఉన్నారు.

Also Read: Grah Gochar: 3 గ్రహాల సంచారం.. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయ్

చేతబడి సక్రమంగా పని చేయట్లేదా.. లేక బాబా మంత్రాలకు అంత పవర్ లేదా అనుకుంటూ బాబాను ఆమె అడిగేది. చివరికి తన డబ్బులు తనకు ఇవ్వాలని ఆమె బాబాను అడుగుతూ ఉండేది. ఇక బాబా డబ్బులు ఇవ్వకపోవడంతో.. చివరికి మోసపోయానంటూ గ్రహించి పోలీసులను ఆమె ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బాబాను అరెస్ట్ చేశారు. అయితే అసలు అత్తమామను ప్లాన్ చేసి చంపాలని అనుకున్న సదరు మహిళ మీద ఏదైనా చర్య తీసుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

Kishan Reddy: జమ్మూలో ఎక్కువ సీట్లు సాధించాం.. ప్రజల విశ్వాసం మాపైనే.. కిషన్ రెడ్డి

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Centers: వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారా…? అయితే ఈ శుభవార్త మీ కోసమే…

Guidelines GO: ‘ఇది దేశ చరిత్రలోనే ప్రథమం’

Jagadish Reddy: భట్టి విక్రమార్క బహిరంగ చర్చకు సిద్ధమా..? జగదీశ్ రెడ్డి సవాల్

Jupally: రాష్ట్ర ప‌ర్యాట‌కంపై అమెరికాలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌చారం.. ప్రశంసల పరంపర

×