EPAPER
Kirrak Couples Episode 1

BL Santhosh: సొంతరాష్ట్రంలో సంతోష్ ఫసక్!.. మరి, తెలంగాణలో..?

BL Santhosh: సొంతరాష్ట్రంలో సంతోష్ ఫసక్!.. మరి, తెలంగాణలో..?


BL Santhosh: బీఎల్ సంతోష్. ఇప్పుడు ఈ పేరు మరోసారి తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఆయన కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు. పైగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మోదీ, అమిత్ షా మాదిరి వ్యూహాలు రచిస్తారన్న పేరుంది. ఇప్పటికే బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పని చేసిన అనుభవం ఉంది. సీన్ కట్ చేస్తే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఘోర పరాజయం. రాజకీయ పండితుడిగా పేరున్న బీఎల్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఆయన ప్లాన్స్ వర్కవుట్ అవుతాయా?

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి టెస్ట్ లో సక్సెస్ ఫుల్ గా పాస్ అయ్యారు. అటు బీఎల్ సంతోష్ మాత్రం సొంత రాష్ట్రంలో బీజేపీని గట్టెక్కించలేకపోయారు. వ్యూహాలు రచించడం, బీజేపీలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్న మోదీ, అమిత్ షాలకే సలహాలిచ్చే పొజిషన్ లో ఉన్న బీఎల్.. కన్నడనాడిని పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారన్న టాక్ నడుస్తోంది.


సౌత్ లో కర్ణాటక తర్వాత స్కోప్ పెరిగిన తెలంగాణపై బీఎల్ సంతోష్ వర్కవుట్ చేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను డీల్ చేస్తున్నారు. ఎన్నికల వ్యూహాలపై ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. అయితే సొంత రాష్ట్రం ఓటరు నాడిని పట్టుకోవడంలో పట్టు తప్పిన బీఎల్.. తెలంగాణలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కర్ణాటక గెలుపుతో తెలంగాణలోనూ జోష్ పెంచుకునే ప్లాన్స్ లో బీజేపీ నేతలు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ అనుకున్నదొక్కటి, అయింది మరొకటి అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఒక్కో నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ వారిని సరిగా డీల్ చేయలేకపోయారన్న టాక్ నడుస్తోంది. కర్ణాటకలో బీజేపీ ఏకంగా 73 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది. ఇందులో టిక్కెట్ రాని వారు కొత్త వారికి ఎంత వరకు సహకరించారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. కర్ణాటక పోయింది సరే… వచ్చేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. మరి ఇక్కడ కూడా ఇవే బీఎల్ సంతోష్ స్ట్రాటజీలు వర్కవుట్ అవుతాయా అన్న చర్చ మొదలైంది. నిజానికి తెలంగాణలో ఫాంహౌజ్ కేసులో బీఎల్ నిందితుడిగా ఉన్నారు. కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చేర్చుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా .. ఫాంహౌజ్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీఎల్ సంతోష్ టార్గెట్ గా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అసలు సంతోష్ స్ట్రాటజీలు ఏవీ వర్కవుట్ కాకుండా బీఆర్ఎస్ నేతలు అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నారు. ఇంకోవైపు కర్ణాటక ఘన విజయంలో కాంగ్రెస్ మంచి జోష్ తో కనిపిస్తోంది. పార్టీ అగ్ర నాయకులు కూడా రెగ్యులర్ గా తెలంగాణలో పర్యటించేలా కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయం. అయితే ఇందులో రెండు పార్టీల మధ్యే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఆ రెండు పార్టీలు ఏవన్నదే కీలకం. అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామే అని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలను చూశాక.. బీఎల్ సంతోష్ స్ట్రాటజీ ఎలా పక్కదారి పట్టిందో అర్థమవుతోందంటున్నారు. సీనియర్లను పొమ్మనలేక పొగబెట్టి పార్టీలో వాతావరణం మారిపోయేలా చేశారన్న అపవాదు ఉంది. కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వడం, టిక్కెట్లు రాని అసంతృప్తులను సరిగా డీల్ చేయలేకపోవడం ఇంకో మైనస్ గా చెబుతున్నారు. లింగాయత్ లపై విమర్శలు ఇవన్నీ రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్లాయంటున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి వేరు. ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. టిక్కెట్ రాదు అనుకుంటున్న వారు ఇప్పటికే పార్టీ నుంచి మెల్లగా సర్దుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీఎల్ సంతోష్ గెలుపు వ్యూహాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయన్న ప్రశ్నలైతే ఉన్నాయి. హైకమాండ్ ప్లాన్ బి ఆలోచిస్తుందా.. మరోసారి బీఎల్ సంతోష్ నే నమ్ముకుంటుందా చూడాలి.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×