EPAPER

Telangana Politics : స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా?: బీజేపీ

Telangana Politics : స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా?: బీజేపీ

Kishan Reddy Politics : కిషన్ రెడ్డి అటాక్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ లక్ష్యంగా మరోసారి కాషాయ నేతలు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నాయకుల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్‌ వీడియోలు ప్రదర్శించిన నేపథ్యంలో బీజేపీ ఎదురుదాడికి దిగింది. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న విషయం వీడియోలో ఎక్కడా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయేంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు.


KCR Politics : కేసీఆర్ కథ
కేసీఆర్‌ ఊహల నుంచి పుట్టిన కథే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమని కిషన్ రెడ్డి అన్నారు.స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? అని ప్రశ్నించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? అంటూ నిలదీశారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని విమర్శించారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్పించుకునే అలవాటు టీఆర్ఎస్ కు ఉందేమోగాని బీజేపీకి లేదన్నారు. తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అధిష్ఠానం తమను సంప్రదిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Politics : బురదజల్లే ప్రయత్నం
టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడంలేదని షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగానే అధికారంలోకి వస్తామన్నారు. నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్ధాన్ని వీడియోల రూపంలో పెడితే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం కాలేరనే భయంతోనే ఇలా చిల్లర,జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో ఇచ్చారని ఆరోపించారు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో టీడీపీ ఏవిధంగా బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందో.. ఇప్పుడు కేసీఆర్ అదే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.


Telangana Politics : ఫామ్ హౌస్ కథ
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్‌ కోల్పోయారని విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు.కేసీఆర్‌ ఫామ్ హౌ స్‌లోనే సినిమా కథ అల్లారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేసిన విషయాన్ని తరుణ్‌ ఛుగ్‌ గుర్తు చేశారు. టీఆర్ఎస్ నేతలు నిజాయితీగా ఉంటే ఎందుకు ప్రమాణం చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన తప్పులకు ప్రజల ఓటు ద్వారా తగిన సమాధానం చెబుతారన్నారు.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×