EPAPER

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

Sunil Bansal on T BJP Leaders: బీజేపీ నేతలకు.. బన్సల్‌ ట్రీట్మ్‌మెంట్

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టి.. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాషాయపార్టీ అడుగులు వేస్తోందట. అందుకే.. టీ-బీజేపీ నేతలు దూకుడు పెంచారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందట. నేతల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి.. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం పావులు కదుపుతోందట. అందుకే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్‌ వేగంగా పావులు కదుపుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కారు అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల్లో ఏవైనా తప్పిదాలు ఉంటాయని కాషాయనేతలు వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ అన్నదాతల సమస్యలపై పోరాటాలు చేస్తూ వస్తున్న రాష్ట్ర బీజేపీ.. తాజాగా మూసీ, హైడ్రాపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ కాషాయ దళంలో కొంత స్తబ్ధత కనిపించింది. సభ్యత్వ నమోదుపై పార్టీ దృష్టి పెట్టడంతో.. మిగతా కార్యక్రమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారట. నేతల మధ్య సమన్వయ లోపంతో క్యాడర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జాతీయ అధినాయకత్వం.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న అయోమయ పరిస్థితులకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని నిర్ణయం తీసుకుందట. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సల్.. రెండురోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య సమన్వయంపై విడివిడిగా నేతలతో భేటీ అయ్యారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే అంశాలపై బన్సల్ ఆరా తీసినట్లు సమాచారం.


తమ నియోజకవర్గాల్లో పార్టీ నేతల తీరుతో ఎదురవుతున్న ఇబ్బందులను సునీల్ బన్సల్‌కు పార్టీ నేతలు, శ్రేణులు చెప్పుకున్నారట. వారంతా సమస్యలను బన్సల్ దృష్టికి తీసుకెళ్లారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ సిద్ధాంతం తెలిసిన వారిమని.. సీనియర్‌ అనే భావంతో కొందరు. కొత్తవారిని పార్టీలో తక్కువ చేసి చూస్తున్నారంటూ బన్సల్‌కు ఫిర్యాదు చేసినట్లు టాక్ నడుస్తోంది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపైనా ప్రజాప్రతినిధులను.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అడిగి తెలుసుకున్నారట. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియా ముందు ఎవరూ ప్రస్తావించవద్దని.. సునీల్ బన్సల్ తెలంగాణ నేతలకు కఠినంగానే చెప్పినట్లు సమాచారం.

Also Read:  బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

నేతలంతా కలిసికట్టుగా వెళితే కలిగే ప్రయోజనాలను సునీల్ బన్సల్ నేతలకు వివరించారట. ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో… బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం… సమిష్టిగా వెళ్లి గవర్నర్, డీజీపీని కలిశారు. రాజ్ భవన్ నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలో.. మెదక్ ఎంపీ రఘునందన్ స్వయంగా వాహనం నడిపి.. ఈటల, కొండా, మహేశ్వర్ రెడ్డిని తీసుకెళ్లారట. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలు ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. దీంతో పాటు మూసీ బాధితుల పక్షాన పోరాటానికి కమలం నేతలు కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం తొమ్మిది బృందాలుగా విడిపోయి.. ఆందోళనలు చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తానికి అధిష్టానం నుంచి వచ్చిన సుతిమెత్తని హెచ్చరికలు.. కఠినమైన సూచనల ఎఫెక్ట్‌తో తెలంగాణ కాషాయదళం ప్రజాసమస్యలపై పోరుబాటుకు సిద్ధమైందట. మొన్నటి దాక రైతాంగ సమస్యలపై.. గొంతెత్తిన బీజేపీ.. తాజాగా మూసీ, హైడ్రా వైఫల్యాలపై గళం వినిపిస్తున్నరట. 9 బృందాలు కలసి.. 18 ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలతో కలవాలని నిర్ణయించుకున్నారట. దీంతో పాటు హైడ్రా కూల్చిన ప్రదేశాలను కూడా పరిశీలించారు. తమ పర్యటనలో విషయాలను పెద్ద ఎత్తున సభ పెట్టి అందులో ప్రస్తావించాలని బీజేపీ శ్రేణులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా.. ఈనెల 25న ఇందిరాపార్కు వేదికగా మహాధర్నా చేపట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారట.

నాడు విభేదాలతో ఉన్న నేతలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు సునీల్ బన్సల్‌ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. బన్సల్ ఇచ్చిన సలహాలు, సూచనలు, సుతిమెత్తని హెచ్చరికలూ.. బాగా పనిచేశాయనే అంశంపై చర్చ సాగుతోంది. అయితే.. ఆ మీటింగ్ ప్రభావం తాత్కాలికంగానే పని చేస్తుందా లేదా అనే అంశం.. ఉత్కంఠగా మారింది. ఇకపై టీ-బీజేపీ నేతలు.. సమిష్టిగా నడుస్తారా..లేదా.. అనేది వేచి చూడాల్సిన అంశంమని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

Related News

KTR Vs Konda Sureka: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

BRS: బీఆర్ఎస్ పేరు మార్చే యోచన, కేటీఆర్ సంకేతాలు .. మరి కలిసొస్తుందా?

Big Stories

×