EPAPER

Congress: షేర్లు కొంటే తప్పేంటి?.. రఘునందన్ రావు ఫైర్

Congress: షేర్లు కొంటే తప్పేంటి?.. రఘునందన్ రావు ఫైర్

– సెబీ చైర్ పర్సన్ షేర్లు కొనకూడదని ఎవరు చెప్పారు?
– రాహుల్ గాంధీ పెళ్లిపై వచ్చిన వార్త కూడా నిజమేనా?
– కాంగ్రెస్ ధర్నాపై రఘునందన్ రావు ఫైర్
– సిట్ వేద్దామా అంటూ రేవంత్‌పై సెటైర్లు
– హరీష్ రావు ఆలయాల యాత్రపైనా ఆగ్రహం
– పదవి పోతేనే దేవుడు గుర్తొచ్చాడా అంటూ ఫైర్


Raghunandan Rao: అదానీ కుంభకోణం, సెబీ చైర్ పర్సన్‌ ఇష్యూపై ఈడీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి తమ్ముడు దందా చేయడం తప్పు కానప్పుడు, సెబీ చైర్ పర్సన్ షేర్లు కొంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. షేర్లు కొనొద్దని భారత ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా అని అడిగారు. సుప్రీంకోర్టు సెబీని ఏమైనా తప్పు పట్టిందా అని ప్రశ్నించిన ఆయన, రాహుల్ గాంధీకి సెబీ, సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. హిండెన్ బర్గ్‌లో వచ్చిన విదేశీ వార్తలపై మాత్రం రాహుల్ గాంధీకి నమ్మకం ఉందని, విదేశీ శక్తులతో చేతులు కలిపి ప్రధానమంత్రి అవుదామని కలలు కన్నారని మండిపడ్డారు. అది జరగకపోయేసరికి వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు. భారత వాణిజ్య వ్యాపారాలను కాంగ్రెస్ దెబ్బతీయాలని అనుకుంటోందా? అని ప్రశ్నించారు రఘునందన్ రావు.

రాహుల్ గాంధీకి హిండెన్ బర్గ్ రాసిందే నమ్మకం అయితే, బ్లిట్జ్ పైన ఎందుకు నమ్మకం లేదని అడిగారు. బ్లిట్జ్ పేపర్‌లో రాహుల్ గాంధీకి వివాహం అయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని రాశారని గుర్తు చేశారు. బ్లిట్జ్ పేపర్ రాసింది తప్పు అయితే నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ పత్రికకు నోటీసులు ఇవ్వకపోతే అందులో ప్రచురించిన ఫోటోలోని వ్యక్తి తన భార్య అవునో కాదో రాహుల్ చెప్పాలన్నారు. దీనిపైన నిజానిజాలు తేల్చేందుకు సిట్ వేద్దామా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రఘునందన్. ఎవరో రాసిన రెండు లైన్లను పట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు.


Also Read: Kaleshwaram Project: కేసీఆర్ ఒత్తిడి వల్లే.. : కాళేశ్వరం విచారణ కమిషన్ విచారణలో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి

‘‘రిజిస్టర్ కంపెనీలు పెట్టుకొని వ్యాపారం చేసుకోండి. అక్రమ దందాలు కాదు. ఒక్క ఎంపీలేని బీఆర్ఎస్ జేపీసీపైన ఏం సమాధానం చెబుతుంది. డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి బ్లిట్జ్ పేపర్ ఇస్తా. రాహుల్ గాంధీ వివాహం చేసుకుంటే నాకేం ఇబ్బంది లేదు. కాబాయే ప్రధాని అని చెప్పుకుంటున్న ఆయన విదేశాల్లో పబ్, క్లబ్‌ల్లో అమ్మాయిలతో తిరగడమేంటి? జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబుతున్నారు. ఆయనది కాకపోతే డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు నోటీసులు పంపారు. పదవిపోతే హరీష్ రావుకు దేవుడు గుర్తుకువచ్చారా? బండి సంజయ్ యాదగిరి గుట్ట నరసింహ స్వామి మీద ప్రమాణం చేద్దాం రా అన్నప్పుడు దుప్పటి కప్పుకుని పడుకున్నారా’’ అంటూ నిలదీశారు రఘునందన్ రావు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×