EPAPER

BJP: హైడ్రా ఏమైనా సర్వరోగ నివారిణా?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

BJP: హైడ్రా ఏమైనా సర్వరోగ నివారిణా?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

HYDRA: రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా హైఫీవర్ నడుస్తున్నది. ఏ రాజకీయ నాయకుడైనా హైడ్రా గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. చెరువులు, కుంటలు రక్షణ ధ్యేయంగా హైడ్రా చేపడుతున్న పనులను చాలా మంది రాజకీయాలు సమర్థిస్తుండగా.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇంకొందరు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడంలో భాగంగా హైడ్రా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో ముందుకే వెళ్లుతామని స్పష్టం చేసింది. తాజాగా, హైడ్రా విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్ స్పందిస్తూ.. అందరికీ సమన్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా పారదర్శకంగా ముందుకు సాగాలన్నారు.


రాష్ట్రంలో అనేక సమస్యలు విజృంభిస్తు్న్నా.. ప్రభుత్వం మాత్రం అన్ని రోగాలకు మందు హైడ్రానే అన్నట్టుగా హడావుడి చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. చెరువులను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వ భూములనూ కాపాడాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఈ క్రమంలో హైడ్రా తీసుకుంటున్న చర్యల్లో పారదర్శకత లోపించరాదని తెలిపారు. పేదల పొట్ట కొట్టకుండా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదలను కొడతాం.. పెద్దలకు పంచి పెడతాం అంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అందరికీ సమన్యాయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. గత ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయని, ఇప్పుడు వాటిని ప్రభుత్వమే కూలగొట్టడం సరైంది కాదని పేర్కొన్నారు. అనుమతులు ఇచ్చిన కారకుల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎండోమెంట్ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డైవర్ట్ పాలిటిక్స్ కోసం హైడ్రాను తెరమీదికి తీసుకువచ్చారా? అనే అనుమానాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు.

Also Read: Hydra Commissioner: జగన్‌కు నోటీసుల ప్రచారంపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఏం చెప్పారంటే..?


ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో స్వర్గా్న్ని చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరకాన్ని చూపిస్తున్నదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని కే లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డులు పట్టుకుని ప్రజలు ఆయా కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తు్న్నారన్నారు. ఢిల్లీకి కప్పం కట్టే పనిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని, తెలంగాణ కూడా ఢిల్లీకి ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఈ గ్యారంటీల నుంచి ప్రజలను దారి మళ్లించడానికి ఫోర్త్ సిటీ, హెల్త్ సిటీ, స్కిల్ సిటీ పేర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులున్నాయని, విష జ్వరాలతో రాష్ట్రం అల్లాడుతున్నదని బీజేపీ ఎంపీ అన్నారు. పాలన పడకేసిందని, గ్రామీణ ప్రాతాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, డ్రైనేజీ కంపుతో ప్రజలు అల్లాడుతుంటే కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నిధులు లేవని, నియామకాలు కూడా జరగడం లేదని పేర్కొన్నారు. త్వరలో తాము స్పష్టమైన ఎజెండాతో పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు. ఇప్పుడు సభ్యత్వ నమోదుపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించామని వివరించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×