EPAPER
Kirrak Couples Episode 1

BJP Meeting : బైంసా పేరు మారుస్తాం .. బీజేపీ డిక్లరేషన్

BJP Meeting : బైంసా పేరు మారుస్తాం .. బీజేపీ డిక్లరేషన్

BJP Meeting : బైంసాలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభకు కార్యకర్తలు భారీగా పోటెత్తారు. ఈ సభా వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను కాషాయ నేతలు ఎండగట్టారు. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్దమన్నారు. పోలీసుల ముందే టీఆర్ఎస్ నాయకులు షర్మిల వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారని మండిపడ్డారు. అసలు తెలంగాణలో శాంతిభద్రతలున్నాయా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు ప్రతిపక్షాలను అణిచివేయడం కోసమే పనిచేస్తున్నారా అని నిలదీశారు.
అప్పుల రాష్ట్రంగా మార్చారు
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, మద్యం తెలంగాణగా మార్చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కు ప్రధాని, గవర్నర్ పై గౌరవంలేదని మండిపడ్డారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్ల లాగా వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ ఒక్క సీటైనా వస్తుందా?
తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కసీటు రాదని తేల్చి చెప్పారు. మోదీ వస్తే ఫామ్ హౌస్ లో దాక్కునే కేసీఆర్.. ప్రధానిని గద్దె దించుతానని అనడం హాస్యాస్పదమన్నారు. వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు వచ్చినా, వెయ్యి బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం భరతం పట్టి, అక్రమాస్తులను పేదలకు పంచి పెడుతామని స్పష్టం చేశారు. దళితబంధు ఈటెల రాజేందర్ వల్లే వచ్చిందని, లబ్ధిదారులు ఈటల, మోదీ ఫొటోలు పెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి…ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు దీవించి అండగా ఉండాలని కోరారు.

బైంసా పేరు మారుస్తాం.. బండి
తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామన్నారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.


ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణ మాత్రం అధోగతి పాలైతోందని బండి సంజయ్ విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయమని నిరసన చేస్తే.. వాళ్లపై ర్యాగింగ్ కేసులు పెడ్తామని భయపెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ కేసీఆర్ చుట్టం కాబట్టే.. ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెడ్తున్నారని ఆరోపించారు. వారిపై కేసులు పెడితే తాము దేనికైనా తెగించి కోట్లాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×