Big Stories

Biryani & Haleem: ఇటు బిర్యానీ.. అటు హలీమ్.. రంజాన్ నెలలో ఫుల్ మస్తీ..

biryani haleem

Biryani & Haleem: రుచులందు బిర్యానీ రుచి వేరు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ పాపులర్ ఫుడ్ బిర్యానీయే. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ టేస్టే సెపరేటు. పేరు చెబితేనే నోరూరాల్సిందే. టేస్టీ ధమ్ బిర్యానీని లొట్టలేసుకుంటూ తినాల్సిందే. బిర్యానీ గురించి అందరికీ తెలిసిందే. మరి, హలీమ్ సంగతేంటి?

- Advertisement -

వారెవా హలీమ్. నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సిందే. ఏడాదికి ఒక్కసారే లభిస్తుంది. నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. హలీమ్ తినేందుకు ఏడాది పొడవుగా ఎదురుచూసే వాళ్లు ఎందరో. మాంసం, పప్పు, నెయ్యి, స్పైసెస్‌లను కలగిలిపి.. రోజంతా స్లో ఫ్లేమ్‌పై ఉడకబెట్టి.. వేడివేడిగా అందిస్తే.. ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే, ముస్లిమ్స్‌తో పాటు అన్నివర్గాల ప్రజలూ హలీమ్‌కు సలామ్ చేస్తున్నారు. డిమాండ్ ఉందికాబట్టే.. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో పదుల సంఖ్యలో హలీమ్ బట్టీలు వెలిశాయి. ఆఖరిరోజు రద్దీ మామూలుగా లేదు మరి.

- Advertisement -

గడిచిన రంజాన్ నెలలో ఆన్‌లైన్లో ఆర్డర్ చేసి హలీమ్‌ను లాగించేశారు ఫుడ్ లవర్స్. హైదరాబాద్‌లో స్విగ్గీకే ఏకంగా 4 లక్షల హలీమ్ ఆర్డర్స్ వచ్చాయంటే క్రేజ్ ఎంతో తెలుస్తోంది. రెగ్యులర్‌గా లభించే మటన్ హలీమ్‌తో పాటు చికెన్, ఫిష్ వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా తయారు చేసింది పిస్తా హౌజ్. ఇలా డిఫరెంట్ వెరైటీస్‌తో హలీమ్ మరింత పాపులర్ అయింది.

ఎంతగా హలీమ్‌కు డిమాండ్ పెరిగినా.. స్విగ్గీ ఆర్డర్స్‌లో ఎప్పటిలానే ఈసారి కూడా బిర్యానీనే టాప్ ప్లేస్‌లో ఉందట. రంజాన్‌ సీజన్‌లో బిర్యానీ అమ్మకాలు తగ్గాల్సింది పోయి.. పెరిగాయని స్విగ్గీ చెబుతోంది. రంజాన్ నెలలో 10 లక్షలకు పైగా బిర్యానీలు డెలివరీ చేసినట్టు సంస్థ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువట. అందుకే అంటున్నారు.. సండే ఆర్ మండే.. డైలీ ఈట్ బిర్యానీ అని.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News