Road Accident in Khammam District: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వద్ద జరిగిన రోడ్డుప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు.
సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగివున్న లారీని.. బైక్ వెనుక నుండి వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఒక విద్యార్ధితో పాటు మరో ఇద్దరు యువకులు మొత్తం ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ప్రమాద దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
Also Read: డేటింగ్ యాప్ లవ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడే ఏం చేశాడంటే..
సత్తుపల్లి మండలం గంగారాం సెంటర్ నుండి స్వగ్రామం రామ గోవిందపురం వైపు వస్తున్న బేతి సురేష్(22),మద్ధిన వేణు (19) తో పాటు అదే గ్రామానికి చెందిన ఆరవ తరగతి విద్యార్థి ఎస్కే కర్రిముల్లా(11) అక్కడిక్కడే మృతిచెందారు.
గంగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఎస్కే కరీముల్లా(11) పాఠశాల నుండి ఇంటికి వెళ్ళే క్రమంలో స్వగ్రామానికి చెందిన బెతి.సురేష్ బండి లిఫ్ట్ అడిగి ఎక్కగా బండి ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.