EPAPER

BigTV vs Ntv: బిగ్ టీవీపై ఎన్టీవీ అక్రమ కేసు.. నిరూపించాలంటూ బిగ్ సవాల్.. తగ్గేదేలే..

BigTV vs Ntv: బిగ్ టీవీపై ఎన్టీవీ అక్రమ కేసు.. నిరూపించాలంటూ బిగ్ సవాల్.. తగ్గేదేలే..
big tv vs Ntv

BigTV vs Ntv(Telugu Breaking News): రోజురోజుకు ప్రజాదారణ పెంచుకుంటూ ఎదుగుతున్న బిగ్‌ టీవీని ఓర్చుకోలేకపోతుంది N-TV. అక్రమంగా కేసులు పెట్టి బిగ్‌ టీవీని బెదిరించేందుకు NTV ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బిగ్ టీవీపై ఏకంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎన్టీవీ యాజమాన్యం. బిగ్‌టీవీకి సంబంధం లేని సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది. అయితే NTV పెట్టే కేసులకు, ఇలాంటి అక్రమ కేసులకు బెదిరేది లేదంటోంది బిగ్‌ టీవీ యజమాన్యం.


ప్రసారాల్లో పోటీ పడాలే తప్ప అక్రమ కేసులతోనో, అక్కసుతోనో పోటీ పడలేరని చెబుతోంది బిగ్‌ టీవీ. నెంబర్‌వన్ ఛానల్‌ అని చెప్పుకునే ఎన్టీవీ కన్నా ముందే AI యాంకర్‌ మాయను పరిచయం చేసిన బిగ్‌టీవీ. తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ టీవీ AI యాంకర్‌ మాయ వైరల్‌గా మారింది. నెంబర్‌వన్ ఛానల్‌ చేయలేకపోయిన పనిని.. బిగ్‌టీవీ చేసిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో బిగ్‌ టీవీపై కక్ష సాధించడానికి కుట్రపూరితంగా కేసులు పెట్టింది NTV యాజమాన్యం. సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుల వెనుక బిగ్‌ టీవీ యాజమాన్యం ఉందంటూ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీడియా ఎథిక్స్‌ను మర్చిపోయి బిగ్‌టీవీని టార్గెట్ చేసింది NTV.

అసలు సోషల్‌ మీడియాలో ఎవరో ఏదో పెడితే బిగ్‌టీవీకి ఏంటి సంబంధం..? జనంలోకి బిగ్‌టీవీ వేగంగా దూసుకెళ్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారా..? మీకంటే అడ్వాన్స్డ్‌ టెక్నాలజీని ప్రేక్షకులకు చూపిస్తున్నందుకు కడుపుమంటగా ఉందా..? అసలేంటి NTV ఉద్దేశమని ప్రశ్నిస్తోంది. సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుల వెనుక ఉన్నట్లు నిరూపించాలని NTVకి బిగ్‌టీవీ ఛాలెంజ్‌ విసురుతోంది. అలా NTV నిరూపిస్తే BIG TV దేనికైనా సిద్ధం అంటోంది. చేతగాక మీరు పెట్టే చిల్లర కేసులకు BIG TV భయపడబోదని.. BIG TV పాత్ర ఉందని నిరూపించలేకపోతే మీరు దేనికైనా సిద్ధమా? BIG TV ప్రశ్నలకు NTV దగ్గర సమాధానం ఉందా? అని నిగ్గదీసి అడుగుతోంది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×