అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు గతంలో కోర్టుకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలోనే అమెరికా పోలీసులకు పాస్‌పోర్టు రద్దు విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
Also Read: సీఎం రేవంత్ టార్గెట్ ఫిక్స్.. తొలుత నేషనల్ గేమ్స్, ఆపై
ట్యాపింగ్ కేసు ఆరోపణలపై మార్చి 10న కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ అమెరికా పారిపోయారు. దీంతో విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు మెయిల్ నోటీసులు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు రప్పించే విషయంలో పోలీసులు అభియోగ పత్రం నమోదు చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ సీఐడీ ద్వారా సీబీఐకి నివేదిక పంపారు. సీబీఐ ఆ నివేదికను ఇంటర్ పోల్‌కు పంపింది. దీంతో వీరిద్దరిపై త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.