EPAPER

Big shock to BRS: బిడ్డా ఏం చేద్దాం.. కారు గుర్తు పోయేటట్టు ఉంది?

Big shock to BRS: బిడ్డా ఏం చేద్దాం.. కారు గుర్తు పోయేటట్టు ఉంది?

Big shock to BRS: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు అతి పెద్ద సమస్య వెంటాడుతోంది. దాన్ని నుంచి బయటపడేందుకు ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్‌రావు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆశలు సన్నగిల్లుతున్నాయి.


అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వివిధ పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో మరో పార్టీ లేకుండా చేశారు. 2014-18 సమయంలో టీడీపీ వంతైంది. 2018-23 వరకు కాంగ్రెస్‌ను అలాగే చేద్దామనుకున్నారు. చివరకు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా తొలగించారు. తెలంగాణలో మాకు ఎదురులేదని అనుకున్నారు కేసీఆర్.

అసలే ప్రజాస్వామ్యం, ప్రజలు ఊరుకుంటారా? అదే చేశారు. నిన్నటి ఎన్నికల్లో కారుని షెడ్‌కు పంపించేశారు. దీంతో ఇంటాబయటా గులాబీ పార్టీని రకరకాల సమస్యలు చుట్టుముట్టాయి. దాని నుంచి బయటపడేందుకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోందని ముఖ్యనేతలు తమ నోటికి పని చెప్పారు.


దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. కారుకు అన్నివైపులా దారులు మూసుకుపోవడంతో ఎమ్మెల్యేలు వలస బాటపట్టారు. 39 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఆ ఫిగర్ 31కి చేరినట్టు కనిపిస్తోంది. ఈ వారం లేదా వచ్చేవారంలో గ్రేటర్‌లోని ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు గ్రేటర్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. అయినా ఎమ్మెల్యేలు కన్వీన్స్ కాలేదు.

ఆరుగురు ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ ఫిగర్ 25కు పడిపోతుంది. కారు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అవసరం కానుంది. ఇప్పుడున్నవాళ్లలో చాలామంది అధికార పార్టీతో టచ్‌లో ఉన్నారు. వారు కూడా వెళ్లిపోతే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోవడం ఖాయమని అంటున్నారు నేతలు. మహారాష్ట్ర మాదిరిగానే తెలంగాణలోనూ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ALSO READ: బీజేపీలో బీఆర్ఎస్ నేతలు అందుకేనా చేరంది?

మరో కొత్త విషయం ఏంటంటే.. బీజేపీతో కుదిరిన అంతర్గత డీల్ కారణంగా పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఎలా ఉంటుందని గులాబీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట. మిగతావాళ్లు విలీనం చేసే బదులు, మనమే కమలంతో దోస్తీ అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నారట. దానివల్ల మనకు ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. మొత్తానికి పార్టీని విడిచిపోతున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా? లేక ఆ పార్టీ పెద్దలు విలీనం చేస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×