EPAPER

CM Revanth: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: అత్యాధునిక స్కూళ్లు.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు. వీటి ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు భూమిపూజ చేస్తారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మధిర నియోజకవర్గంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.


Also Read: కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో విశాలమైన క్యాంపస్‌లో ఈ స్కూళ్లను నిర్మించాలని సంకల్పించింది ప్రభుత్వం. మొదటి విడతలో 28 చోట్ల ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, సామాజిక అంతరాలు లేని విద్యను అందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ క్యాంపస్‌లలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయబోయే ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోటకు చేర్చి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని చూస్తోంది ప్రభుత్వం. దీనివల్ల గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్ట్‌గా మొదటి దశలో 28 నియోజకవర్గాల్లో స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది.


Related News

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Manda Krishna Madiga: రేవంత్ రెడ్డి ఎన్ని ప్రకటనలు చేసినా వేస్ట్.. నమ్మే పరిస్థితిలో దళితులు లేరు!

Felicitated: అడ్వకేట్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలి: సింఘ్వీ

CM Revanth: థాంక్యూ.. సీఎం సార్: బీసీ సంఘాల నేతలు

Big Stories

×