EPAPER

Bhatti: ఖమ్మంలో కేసీఆర్ వెంట భట్టి.. ఏఐసీసీకి ఫిర్యాదు.. వేటు తప్పదా?

Bhatti: ఖమ్మంలో కేసీఆర్ వెంట భట్టి.. ఏఐసీసీకి ఫిర్యాదు.. వేటు తప్పదా?

Bhatti: కాంగ్రెస్ కొట్లాడుతోంది. తనతో తాను.. సర్కారుతోనూ. కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన శక్తినంతా కూడగడుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతో కాస్త జోష్ వచ్చింది. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేలా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఇంఛార్జ్ థాక్రే డైరెక్షన్ లో మరింత డైనమిక్ గా పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో కొందరు సీనియర్ల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. మారరా.. మీరిక మారరా.. అంటూ మండిపడుతున్నారు మిగతా నేతలు. ఇంతకీ ఏం జరిగిందంటే….


ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు ముందు.. ఖమ్మం కలెక్టరేట్ సమీకృత కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అతిథిలుగా వచ్చిన ముఖ్యమంత్రుల సమీక్షంలో ఆరంభించారు. ఇది పక్కా ప్రభుత్వ కార్యక్రమం. బీఆర్ఎస్ క్రెడిట్ రాజకీయం అనే విషయం అందరికీ తెలిసింది. అయితే, ఖమ్మం కంటి వెలుగు ప్రోగ్రామ్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరవడమే ఇప్పుడు పార్టీలో కాంట్రవర్సీగా మారింది. అది ప్రభుత్వ కార్యక్రమం అని తప్పించుకోవడానికి లేదని.. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖమ్మం ప్రోగ్రామ్ కు కాంగ్రెస్ సీనియర్ హాజరుకావడం పక్కా క్రమశిక్షణారాహిత్యమే అంటున్నారు.

తామంతా కేసీఆర్ పై కత్తులు దూస్తుంటే.. సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టి.. ఇలా సీఎంతో అంటకాగడం ఏంటని మండిపడుతోంది కాంగ్రెస్ కేడర్. గతంలోనూ దళిత బంధు పథకంపై చర్చ కోసం భట్టి విక్రమార్క వీరుడిగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ తో చర్చలు జరిపి వచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కంటి వెలుగుకు వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు పోరాట స్పూర్తిని అవమానించారని తప్పుపడుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత తారిక్ అన్వర్, రాష్ట్ర వ్యవహారాల ఇం‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే తదితరులకు మెయిల్ ద్వారా బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేకంగా, అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా తనతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు సైద్ధాంతికంగానే కొట్లాడుతూ ఉంటే సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు ముందు కలెక్టర్ కార్యాలయంలో కంటివెలుగు ప్రోగ్రామ్‌కు భట్టి విక్రమార్క హాజరయ్యారని, ఆయనను అతిథులుగా వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్ పరిచయం కూడా చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌తో ఎంత క్లోజ్‌గా ఉంటున్నారో ఈ సంఘటన రుజువు చేస్తున్నదన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున 2018 ఎన్నికల్లో గెలిచిన 12మంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంలో భట్టి విక్రమార్క ప్రమేయం, ప్రోద్బలం ఉన్నదని తన ఫిర్యాదులో బక్క జడ్సన్ ఆరోపించారు. బలమైన ప్రతిపక్ష నేతగా తన డ్యూటీ నిర్వహించడంలో భట్టి ఫెయిల్ అయ్యారని.. వీటిని పరిగణనలోకి తీసుకుని భట్టి విక్రమార్కపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు.

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×