EPAPER

Bhatti Speech on Skill University: తప్పకుండా.. మీ మాట కూడా పరిగణనలోకి తీసుకుంటాం: భట్టి విక్రమార్క

Bhatti Speech on Skill University: తప్పకుండా.. మీ మాట కూడా పరిగణనలోకి తీసుకుంటాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Speech on Skill University: స్కిల్ యూనివర్సిటీ బిల్లు విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందడానికి గొప్ప యూనివర్సిటీ స్కిల్ యునివర్సిటీ. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర కేబినెట్ మొత్తం యువతీ యువకుల కోసం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతీ యువకుల కోసం ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయం. గౌరవ సభ్యులు చేసిన సూచనలు, సలహాలు బిల్లులో పొందుపరుస్తాం. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన.


అయితే, గతంలో కొన్ని యూనివర్సిటీలను తెచ్చారు. వాటిలో ఎక్కడా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ విద్యార్థులకు ఆ యూనివర్సిటీలలో ఎక్కడా అవకాశం లేదు. కొద్దిమంది వ్యక్తుల కోసం యూనివర్సిటీలను ధారాదత్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడేవిధంగా అన్ని అంశాలు పొందుపరిచి బిల్లును ముందుకు తీసుకెళుతున్నాం. రిజర్వేషన్లతోపాటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుంది. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం కింద కవర్ కాని విద్యార్థులకు ఫీజు తగ్గించే అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

Also Read: సీతక్కపై అవమానకరమైన మీమ్స్.. సీఎం సీరియస్


గవర్నింగ్ బాడిలో ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఓబీసీలు, మైనారిటీలకు ఛాన్స్‌లర్ ద్వారా నామినేట్ చేసే అవకాశం ఉండాలని సభ్యులు కోరారు.. తప్పకుండా కల్పిస్తాం. గొప్ప ఉన్నత ఆశయంతో ముందుకు తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు అందరూ సంతోషంగా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లాలి’ అంటూ డిప్యూటీ సీఎం సభ్యులను కోరారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×