EPAPER

Bhatti Vikramarka: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు భట్టి కౌంటర్లు

Bhatti Vikramarka: జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు భట్టి కౌంటర్లు

ఖమ్మం, స్వేచ్ఛ: త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నామన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ప్రజలకు విలువైన సేవలు అందించండి, మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. పదేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లను భర్తీ చేశామని, వరదలకు పెద్ద ఎత్తున నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరదల సమయంలో రేయింబవళ్ళు సేవలందించిన విద్యుత్ శాఖ సిబ్బందిని అభినందిస్తున్నానని అన్నారు. దసరా సందర్భంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేయబోతున్నామని, వీటి నిర్మాణాలకు ప్రత్యేక డిజైన్లు తయారు చేయించామని వివరించారు.


‘‘ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాభోధన, క్రీడలు, వెకేషన్స్ లో పిల్లల కోసం పాఠశాలలో సినిమా థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో భవనాల నిర్మాణం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో బోధన జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సంబంధించిన పెండింగ్ బిల్స్ రూ.114 కోట్లు విడుదల చేశాం. పిల్లల కాస్మోటిక్ ఛార్జీలను ఏ నెలకు ఆ నెలే అందజేస్తాం. పాఠశాలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేశాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పూర్తి స్థాయిలో విడుదల చేశాం. ఇకపై అందరికీ ప్రతి నెలా జీతాలు అందజేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు పెండింగ్‌లో ఉన్న వాటిని అన్నీ క్లియర్ చేస్తున్నాం. దసరా కంటే ముందే అన్ని రకాల పెండింగ్ బిల్స్ విడుదల చేయబోతున్నాం. అంతేకాదు, దసరాకు సంతోషకరమైన విషయం చెప్పబోతున్నా. రాష్ట్రంలో రైతులు ఎవరికి ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ పోల్స్ కావాలంటే వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 1912 కు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పండి’’ అని అన్నారు.

Also Read: బస్సులల్లో కొట్టుకుంటున్న మహిళలు… ఇది ప్రభుత్వం తప్పా…?


జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు పదేళ్ల పాటు అబద్ధాలు చెప్పి అందరూ తమ లాగే ఉంటారనుకుంటున్నారని సెటైర్లు వేశారు భట్టి. మూసీపై కేబినెట్‌లో చర్చపై మాట్లాడాలంటే ఇది కొత్త అంశం కాదన్నారు. కేబినెట్‌లో చర్చ లేకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా జరుగుతుందని అడిగారు. తమది ప్రజా పాలన అని, కేసీఆర్‌లా ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం ఉండదని స్పష్టం చేశారు. మూసీనీ శుద్ది చేసి నగరం నడిబొడ్డున స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితులలో అన్యాయం జరగనీయని హామీ ఇచ్చారు. పచ్చకామెర్లు ఉన్న వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్టు, బీఆర్ఎస్ నేతలు తప్పులు చేసీచేసీ, మిగిలిన వాళ్లు కూడా అలాగే చేస్తున్నారేమోననే భ్రమలో ఉన్నారని విమర్శించారు. మూసీకి లక్ష 50వేల కోట్లు అని ఎవరు డిసైడ్ చేశారు, ఇంకా డీపీఆర్‌లే సిద్ధం కాలేదన్నారు భట్టి విక్రమార్క.

Related News

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

Telangana Free Bus Effect: బస్సులల్లో కొట్టుకుంటున్న మహిళలు… ఇది ప్రభుత్వం తప్పా…?

Kishan Reddy: జమ్మూలో ఎక్కువ సీట్లు సాధించాం.. ప్రజల విశ్వాసం మాపైనే.. కిషన్ రెడ్డి

Raj Pakala: 111 జీవోలో.. ‘రాజ్’ దర్బార్, బావమరిది కళ్లలో ఆనందమే లక్ష్యం – జన్వాడలో కేటీఆర్ భూ జైత్రయాత్ర

Black Magic: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..

×