EPAPER

Bhatti Vikramarka: ‘ఇది ప్రజాప్రభుత్వం.. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం’

Bhatti Vikramarka: ‘ఇది ప్రజాప్రభుత్వం.. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం’
Bhatti Vikramarka speech

Bhatti Vikramarka in the assembly meeting(Latest political news telangana): తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు తొలగించేదుకు బడ్జెట్‌ ద్వారా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రజలకు సేవచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపు చేశామని ఆయన తెలిపారు. గతంలో ఏటా బడ్జెట్‌ను 20 శాతం పెంచుకుంటూ పోయారన్నారు.గత ప్రభుత్వం రాజస్థాన్‌లో బడ్జెట్‌ కంటే అధికంగా ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు.

రాజస్థాన్‌లో రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్‌ పెడితే గత ప్రభుత్వం రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్‌ పెడితే ప్రమాదంగా మారుతుందన్నారు. రాష్ట్రంపై ప్రస్తుతం మొత్తం రూ. 7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు.


Read More: ఆసరా పింఛన్ల పంపిణీలో గోల్ మాల్.. కాగ్ నివేదిక లో వెల్లడి..

సింగరేణిలో కారుణ్య నియామకాలు పూర్తి చేస్తామని భట్టివిక్రమార్క హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా 16 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా అభద్దాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు భావించారని భట్టివిక్రమార్క అన్నారు. కానీ గత పాలకులు హామీలు అమలు చేయకపోవడం వల్ల అలాగే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×