EPAPER

Beer Price Hike: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బీర్ల ధరలు!

Beer Price Hike: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బీర్ల ధరలు!

Beer Price Hike in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో బీర్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. దీంతో మందుబాబులకు షాక్ తగలనుంది. ఈ బీర్ల ధరలు వచ్చే నెల నుంచి సుమారు   10 నుంచి 12 శాతం వరకు పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెంచనున్న ఈ ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలను ప్రభుత్వం పెంచుతుంది. గతంలో 2022 మార్చిలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం..ఈ ఏడాది మార్చిలోనే పెంచాలి. కానీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపును వాయిదా వేసింది. ప్రస్తుతం మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచనుంది. అయితే ఈ ఏడాది రూ.20 నుంచి రూ.25 వరకు పెంచాలని బీర్ల ఉత్పత్తి కేంద్రాలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ ప్రభుత్వం రూ.10 నుంచి రూ. 12 వరకు మాత్రమే పెంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీర్ల ఉత్పత్తి నుంచి ప్రభుత్వం ఒక్కో బీరు చొప్పున రూ.24.08లకు కొనుగోలు చేసి వైన్స్ షాపులకు రూ.116.66కు విక్రయిస్తుంది. చివరికి వినియోగదారుడికి ఒక్కో లైట్ బీరు రూ.150కు చేరుతుంది.

ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో వినియోగదారులపై భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీర్ల ఉత్పత్తి కేంద్రాల్లో ప్రతి ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారవుతోంది. అయితే ఈ బీరును తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్న వైన్స్ షాపులకు సరఫరా చేస్తుంది.


Also Read: హైదరాబాద్‌లో ఇంటర్నెట్ బంద్ ..

ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఒకవేళ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంటే..కేవలం బీర్ల ధరలు మాత్రమే పెరగనున్నాయని, మిగతా మందు ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ధరలు పెరిగితే ఈ కొత్త ధరలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related News

Andhra, Telangana: మరోసారి తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల మధ్య వివాదం

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Big Stories

×