EPAPER

Suryapeta: మద్యం బాటిళ్లతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌

Suryapeta: మద్యం బాటిళ్లతో అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్‌

Beer Bottles Found In Residential Degree College In Suryapeta: గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ కొలుస్తుంటారు చదువుకునే పిల్లలు. అలా ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు తమ అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతారు. కానీ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ మాత్రం అలా కాదు..తన రూటే సఫరేట్‌ అంటూ రాంగ్‌ రూట్‌లో వెళ్తోంది. విద్యార్థినుల‌కు, టీచ‌ర్ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్, చెడు కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించిన విద్యార్థినులు వీడియో తీసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు తప్పతాగి అందరిని మాన‌సికంగా, శారీకంగా వేధింపుల‌కు గురిచేస్తున్న ఆ ప్రిన్సిపాల్ త‌మ‌కొద్దంటూ విద్యార్థినులు ఏకంగా రోడ్డెక్కారు.


ఇక అసలు వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా బాలెంల‌ సాంఘిక సంక్షేమ గురుకుల మ‌హిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శైల‌జ రాత్రి స‌మ‌యాల్లో బీర్లు సేవిస్తున్న‌ట్లు విద్యార్థినులు ఆరోపించారు. హాస్ట‌ల్ గ‌దిలో ల‌భ్య‌మైన బీరు సీసాల‌ను కూడా విద్యార్థినులు మీడియాకు చూపించారు. కేర్ టేక‌ర్‌తో క‌లిసి ప్రిన్సిపాల్ శైల‌జ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, మ‌ద్యం కూడా సేవిస్తున్నార‌ని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.దీంతో తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు రోడ్డెక్కి.. మీడియాతో మాట్లాడుతూ.. వారి బాధను పంచుకున్నారు. అమ్మాయిల‌ని కూడా చూడ‌కుండా ప్రిన్సిపాల్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. త‌మ త‌ల్లిదండ్రులతో కూడా ప్రిన్సిపాల్ బూతులు మాట్లాడి మాన‌సిక వేధింపుల‌కు గురి చేశార‌న్నారని వారంతా వాపోయారు.

Also Read: గోవా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు


కొద్ధిరోజుల క్రితం తన కుమారుడు సైతం హాస్ట‌ల్‌లో వారం రోజుల పాటు ఉన్నాడ‌ని, అమ్మాయిల హాస్ట‌ల్‌లో అత‌నికి ఏం ప‌ని అని విద్యార్థినులు ప్రిన్సిపల్‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు ఆ టైంలో తాము ఎంతో ఇబ్బందిగా ఫీల‌య్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏసీటీ అండ‌తోనే ప్రిన్సిపాల్ శైల‌జ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతోందని తెలిపారు. అంతేకాకుండా త‌మ‌పై దౌర్జ‌న్యం చేస్తున్నార‌ని విద్యార్థినులు తమ ఆవేదనని పంచుకున్నారు. తాగిన మ‌త్తులో త‌మ‌ను ఏం చేస్తారోన‌ని భ‌యంగా ఉంద‌ని విద్యార్థినులు పేర్కొన్నారు. త‌క్ష‌ణ‌మే ప్రిన్సిపాల్ శైలజ‌తో పాటు ఏసీటీని విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని విద్యార్థినులు కోరారు.

Tags

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×