EPAPER

Bathukamma: అమెరికాలోనూ బతుకమ్మకు అరుదైన గుర్తింపు… అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు

Bathukamma: అమెరికాలోనూ బతుకమ్మకు అరుదైన గుర్తింపు… అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు

– అమెరికాలోనూ బతుకమ్మ ముద్ర
– అధికారిక పండుగగా గుర్తింపు
– ముందుకొచ్చిన పలు అమెరికా రాష్ట్రాలు
– తెలంగాణ హెరిటేజ్ వీక్‌ పేరిట ప్రకటన
– అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు, గవర్నర్లు
– హర్షం వ్యక్తంచేసిన తెలంగాణ ఎన్ఆర్ఐలు


హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఇక్కడి ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. రంగురంగుల పూలనే దేవతలుగా భావించి పూజించే ఈ పండుగను ఏటా తొమ్మిది రోజుల పాటు సందడిగా నిర్వహించుకోవటం తెలిసిందే. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులూ గత పదేళ్లుగా ఈ పండుగకు వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో తెలంగాణ వాసులు అధికంగా నివసించే న్యూయార్క్, న్యూ జెర్సీ, టెక్సాస్, చికాగో, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, వర్జినియా, ఒహాయో, జార్జియా ఫ్లోరిడా, మొదలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఈ పండుగను ఏటికేడు మరింత సందడిగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Also Read: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?


కొన్ని ప్రాంతాలలో అధికారిక గుర్తింపు

ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో మన బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించి.. వారోత్సవాలను ప్రకటించాయి. దీనిని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్‌ నగరం, వర్జీనియా రాష్ట్రాలు తాజాగా ప్రకటించాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాల మేయర్‌, గవర్నర్‌లు అధికార ప్రకటనలు విడుదల చేశారు. కాగా, బతుకమ్మకు గుర్తింపు రావడంపై తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Jupalli: యూఎస్‌లో IMEX … పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మంత్రి జూప‌ల్లి

Sharannavaratri: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?

Harishrao: హరీశ్‌రావు నయా యాక్షన్ ప్లాన్.. దసరా రోజు వారికి ఇబ్బందులు తప్పవా?

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?

Appointments: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

×