వక్ఫ్ బోర్డ్‌లో ఇతర మతాల వారికి చోటు కల్పించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేఖించిన సంగతి తెలిసిందే. టీటీడీలో ఇతర మతాలవారికి స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ఎందుకు ఇతర మతాలవారికి చోటు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న ఓవైసీ అసలు రంగు బయటపడిందని చెప్పారు. టీటీడీ, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే అందుకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఈ రెండింటికీ ఆయనకు తేడా తెలియదా? అని ప్రశ్నించారు.
ALS READ: నా టార్గెట్ బీఆర్ఎస్.. త్వరలోనే అన్నీ బయటపెడతా – అసరుద్దీన్
వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూముల వ్యవహారాలకు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింక్ పెడతారా? అని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డ్ భూములు పేదలకు దక్కాలన్నదే కేంద్రం ఉద్దేశ్యం అని చెప్పారు. అందులో భాగంగానే కేంద్రం సవరణ బిల్లును తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తో పదేళ్లు అంటకాగిన ఎంఐఎం ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కలియగ దైవానికి వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారిని తేడా తెలియని అజ్ఞాని అని విమర్శించారు.
విరాళాలతో టీటీడీ హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తుంది తప్ప ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేయలేదని మండిపడ్డారు. ఓవైసీ దృష్టిలో భగవంతుడు అంటే వ్యాపారమేనని, వేల ఎకరాలను కబ్జా చేశాడని ఆరోపించారు. కాలేజీలు ఆస్పత్రులు కట్టి వేల కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఓవైసీ మాటలు నమ్మి మోసపోతున్న పాతబస్తీ ముస్లీం సోదరులకు చెప్తున్నది ఒకటే..ఇకనైనా తెలుసుకోండి మజ్లిస్ గెలుస్తున్నా పాతబస్తి ఎందుకు అభివృద్ధి చెందలేదు? న్యూసిటీ, సైబరాబాద్ లా ఎందుకు అవ్వట్లేదని ప్రశ్నించారు.