EPAPER

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

Ganesh Laddu: నవరాత్రులు గణేషుడి వద్ద ఉంచిన లడ్డూకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ లడ్డు తిన్నవారికి గణనాథుడు కోరిన కోర్కెలు తీర్చుతారనే నమ్మకం ఉన్నది. గణపతి లడ్డును పవిత్రంగా భావిస్తారు. ఈ లడ్డును వేలంపాట పాడి విక్రయిస్తారు. అత్యంత ఖరీదైన లడ్డుగా దాదాపు ప్రతియేటా బాలాపూర్ విఘ్నేశ్వరుడి లడ్డు నిలుస్తున్నది. రేపు ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. తాపేశ్వరం స్వీట్ హౌజ్ యాజమాన్యం అందించిన ఈ లడ్డు వేలానికి రేపు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది రూ. 27 లక్షలకు ఈ లడ్డు అమ్ముడుపోయింది. ఈ సారి లడ్డూ వేలంలో కొత్త నిబంధన పెట్టారు. రూ. 27 లక్షలు డిపాజిట్ చేసిన వారికే వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బాలాపూర్ లడ్డు చుట్టు ఆసక్తికరమైన చరిత్ర తెలుసుకుందాం.


రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్‌లో ప్రతిష్టించిన గణపతి లడ్డూకు లక్షలు పెట్టి సొంతం చేసుకోవడానికి పోటీ పడుతారు. ఇక్కడ తొలిసారి 1994లో గజాననుడిని ప్రతిష్టించారు. అప్పటి నుంచి లడ్డు వేలం ప్రక్రియ కొనసాగుతున్నది. 1994లో బాలాపూర్ గణేషుడి లడ్డు రూ. 450కి వేలంలో దక్కించుకున్నారు. మరుసటి ఏడాది ఇది 4500కు పెరిగింది.

1995లో 18 వేలకు, 97లో 28 వేలు, 98లో 51 వేలు, 99లో 65 వేలు, 2000లో 66 వేలకు, 2001లో 85 వేలకు ఈ లడ్డు వేలంలో అమ్ముడుపోయింది. 2002లో లక్షా 5 వేలు, 2003లో లక్షా 55 వేలు, 2004లో 2 లక్షలు, 2005లో 2 లక్షలు 8 వేలు, 2006లో 3 లక్షలు, 2007లో 4 లక్షల 15 వేలు, 2008లో 5 లక్షల 7 వేలు, 2009లో 5 లక్షల 10 వేలకు, 2010లో 5 లక్షల 35 వేలు, 2011లో 5 లక్షలు 45 వేలు, 2012లో 7 లక్షల 50 వేలు, 2013లో 9 లక్షల 26 వేలు, 2014లో 9 లక్షలు 50 వేలు, 2015లో 10 లక్షలు 32 వేలు పలికింది. 2016లో 14 లక్షల 65 వేలు, 2017లో 15 లక్షలు 60 వేలు, 2018లో 16 లక్షలు 60 వేలు, 2019లో 17 లక్షలు 50 వేలుగా బాలాపూర్ లడ్డు పలకగా.. 2020లో మాత్రం కరోనా కారణంగా వేలం జరగలేదు. అప్పుడు నాటి సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆ లడ్డును అందించారు.


Also Read: Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

2021లో 18 లక్షలు 90 వేలకు, 2022లో 24 లక్షలు 60 వేల వేలంపాడి బాలాపూర్ లడ్డు వేలంలో దక్కించుకున్నారు. గతేడాది మాత్రం దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలు పెట్టి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. ఇక రేపు నిర్వహించే వేలంలో ఈ సారి బాలాపూర్ లడ్డు ఎంత పలుకుతుందో చూడాల్సి ఉన్నది. గతేడాది రూ. 27 లక్షలకు తక్కువైతే పలికే చాన్స్ లేదు. ఎందుకంటే.. ముందే రూ. 27 లక్షలను డిపాజిట్ చేసుకునే వేలం మొదలుపెట్టనున్నారు. అంటే.. బాలాపూర్ లడ్డు వేలం మొదలైన 1994 నుంచి ఇప్పటి వరకు తగ్గింది లేదు. ప్రతి యేటా అంతకంత లడ్డూ అధిక ధరకే పోయింది. ఈ సారి రూ. 27 లక్షలకు మించే వేలంపాట వినిపించే చాన్స్ ఉన్నది. గరిష్టంగా ఎంత పలికి ఈ లడ్డును స్వాధీనం చేసుకుంటారనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

మరో విషయం ఏమిటంటే.. బాలాపూర్ లడ్డు వేలం వేసి వచ్చిన డబ్బులను ఆ ఊరి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెడుతున్నారు. ఈ లడ్డు డబ్బులతోనే బాలాపూర్ హైస్కూల్ అభివృద్ధి చేశారు. బాలాపూర్‌లో హనుమాన్, లక్ష్మీ గణపతి మందిరాలను నిర్మించారు. వేణుగోపాలస్వామి దేవాలయ పునర్నిర్మాణ, శివాలయం, కంఠ మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, పోచమ్మ మందిరం నిర్మాణం, మహంకాలి మందిరం, మల్లన్న గుడి, అయ్యప్ప స్వామి సన్నిదానం అభివృద్ధికి ఈ డబ్బులను వెచ్చించారు. గణేష్ మండపం కోసం 130 గజాల స్థలం కొన్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×