EPAPER

Balakrishna Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి.. జూన్ నాలుగు తర్వాత..!

Balakrishna Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ నివాళి.. జూన్ నాలుగు తర్వాత..!

Balakrishna Tribute to NTR Jayanthi: స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే ఓ వ్యక్తి కాదని అదొక శక్తి అని ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సోదరుడు రామకృష్ణతో కలిసి నివాళులర్పించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాల్లో రారాజుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. తెలుగువారికి ఆయనొక ఆరాధ్య దైవమన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆరేనని గుర్తుచేశారు.

ఒకప్పుడు రాజకీయాలంటే కొందరికి మాత్రమే పరిమితమై ఉండేవని, ఎన్టీఆర్ అడుగు పెట్టాక ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు బాలకృష్ణ. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందన్నారు. ప్రజల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.


Also Read: ఎన్టీఆర్‌ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్‌, కళ్యాణ్‌రామ్‌

మరోవైపు ఎన్టీఆర్ మరణించినా, ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. తెలుగు ప్రజల మనసులో స్థిరమైన స్థానం సంపాదించిన వ్యక్తి అని కొనియాడారామె. అంతకుముందు ఘాట్‌కు వచ్చిన ఆమె ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేమన్నారు. జూన్ నాలుగు తర్వాత ఏపీలో సుపరిపాలన రాబోతోందని మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణలోనూ మంచి పరిపాలన అందించాలని కోరుకున్నట్లు తెలిపారు లక్ష్మీపార్వతి.

Tags

Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×