EPAPER

raja singh: రాజాసింగ్ కు బెయిల్.. షరతులు ఇవే..

raja singh: రాజాసింగ్ కు బెయిల్.. షరతులు ఇవే..

raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కండిషన్ పెట్టింది. మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు చేపట్ట రాదని ఆదేశించింది. హైకోర్టు బెయిల్ తో 57 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు రాజాసింగ్.


మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఆయనపై పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు తరలించారు.

రాజాసింగ్ పై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించడంపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు సమంజసమేనంటూ.. రాజాసింగ్ పై 100కు పైగా కేసులు ఉన్నాయంటూ.. అడ్వకేట్ జనరల్ వాదించారు. సమగ్ర విచారణ అనంతరం రాజాసింగ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.


ఇదే విషయంలో రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. తనపై కుట్ర చేశారంటూ రాజాసింగ్ వివరణ కూడా ఇచ్చారు. అయితే, రాజాసింగ్ వివరణ తర్వాత కూడా బీజేపీ అధిష్టానం ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేటు వేయకుండా.. అలాగని తిరిగి పార్టీలో చేర్చుకోకుండా.. వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది.

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×