EPAPER

Babu Mohan : ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్.. వరంగల్ నుంచి పోటీ..

Babu Mohan : ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్.. వరంగల్ నుంచి పోటీ..

Babu mohan joins praja shanthi party


Babu mohan joins praja shanthi party(Political news today telangana): సినీ నటుడు , మాజీ మంత్రి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ .. బాబూమోహన్ కు కండువా కప్పి ఆహ్వానించారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయనను పోటీకి దింపుతామని కేఏ పాల్ ప్రకటించారు.

మొన్నటి వరకు బాబూమోహన్ బీజేపీలో ఉన్నారు. కొంతకాలం క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బాబూమోహన్ పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలో కాషాయ పార్టీలోని పరిస్థితులపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో గ్రూపులున్నాయని ఆరోపించారు. తనపై విమర్శలు చేయడంపైనా మండిపడ్డారు.


Read More: బీఆర్ఎస్ రెండో లిస్ట్ విడుదల.. ఎంపీ అభ్యర్థులుగా నామా, కవితకు అవకాశం..

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బరిలోకి దిగాలని బాబూమోహన్ భావించారు. తనకు టిక్కెట్ దక్కే పరిస్థితులేన్న కారణంతోనే కాషాయ కండువాను వదిలేశారు. ఓరుగల్లు నుంచి ఎంపీగా గెలవాలన్నదే బాబూమోహన్ కల. ఈ విషయాన్ని గతంలోనే ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీలో చేరారు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.

బాబూమోహన్ తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించారు. ఎన్టీఆర్ ఉన్న సమయంలోనే టీడీపీకి మద్దతు తెలిపారు. తొలిసారి 1998 ఆందోల్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎలక్షన్ విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగానూ పనిచేశారు.

2004, 2009 ఎన్నికల్లో వరుసుగా రెండుసార్లు ఆందోల్ లో బాబూమోహన్ ఓటమిపాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. 2014 వరకు టీడీపీలోనే ఉన్న బాబూమోహన్.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.  2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. దామోదర రాజనర్సింహను బాబూమోహన్ ఓడించారు. అయితే 2018లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు.

2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీకి గుడ్ బై బాబూమోహన్ చెప్పారు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరారు.

 

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×