AvinashReddy Latest News(Andhra Pradesh News): వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ఎపిసోడ్ డైలీ సీరియల్‌గా సాగుతోంది. సీబీఐయేమో ఎప్పుడెప్పుడు అవినాష్‌ను అరెస్ట్ చేద్దామా? అని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనేమీ తనను అరెస్ట్ చేయొద్దంటూ ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలు, వైఎస్ సునీత మాత్రం అవినాష్‌కు ముందస్తు బెయిల్ రాకుండా వెంటాడుతూనే ఉన్నారు. ఇలా అవినాష్‌రెడ్డి ఎపిసోడ్ కొన్నిరోజులుగా డైలీ న్యూస్‌లో నానుతోంది.
లేటెస్ట్‌గా తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం హైకోర్టుకు లాస్ట్ వర్కింగ్ డే. శనివారం నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు. ఇప్పటికే అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మూడు పక్షాలు వాదనలు వినిపించాయి. రెండు సార్లు కేసు వాయిదా పడింది. శుక్రవారం తీర్పు వస్తుందని భావించారు. కానీ, అనుకోని ట్విస్ట్.
ముందస్తు బెయిల్‌పై ఇప్పుడే తీర్పు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. కేసును వెకేషన్ బెంచ్‌కు మార్చుకుంటారా? అని అడిగింది. అర్జెన్సీ ఉందంటూ.. అవినాష్, సీబీఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. ముందస్తు బెయిల్‌ను ఇన్నిరోజులు పెండింగ్‌లో పెట్టడం భావ్యం కాదంటూ.. అంత అర్జెంట్ అయితే చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేయాలని న్యాయమూర్తి సూచించారు. తదుపరి విచారణ జూన్ 5కు వాయిదా వేశారు.
అయితే, జడ్జి సూచించినట్టుగా చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేశారు అవినాష్ తరఫు లాయర్. అయితే, సీజే సైతం ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదన్నారు. అర్జెంటుగా విచారణ చేయాలంటూ కోర్టును ఒత్తిడి చేయడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు సీజే సైతం ఈ కేసుపై కామెంట్ చేశాక.. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారంటూ తప్పుబట్టారు. వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవాలని సూచించారు హైకోర్టు చీఫ్ జస్టిస్.
హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌పై ఊరట లభించకపోవడంతో ఎంపీ అవినాష్‌రెడ్డికి తిప్పలు తప్పేలా లేవు. సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వెకేషన్ బెంచ్ ముందు అప్పీల్ చేసుకోవడం మినహా అవినాష్‌రెడ్డికి మరో ఆప్షన్ లేకుండా పోయింది. అక్కడ మరెంత కాలం సాగుతుందో విచారణ. ఈలోగా సీబీఐ అరెస్ట్ చేసేస్తే?