EPAPER

BJP: బీజేపీ ట్రబుల్ షూటర్‌గా అసోం సీఎం.. యాక్షన్ హీరో..

BJP: బీజేపీ ట్రబుల్ షూటర్‌గా అసోం సీఎం.. యాక్షన్ హీరో..
assam cm

BJP: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ బీజేపీ ట్రబుల్ షూటర్ గా ఎదిగారా? ఇప్పటికే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న హిమంత.. కమలం హైకమాండ్ కు నమ్మిన లీడర్ గా మారారా? అంటే అవునన్న సమాధానమే వస్తుంది. అధినాయకత్వంపై విధేయత చూపడంలో ముందుండే హిమంత.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు దేశంలోనే కీలక నేతగా ఎదిగారు. అసలు అసోం సీఎం రోజూ ఎందుకు వార్తల్లో ఉంటున్నారు? తెరవెనుక ఏం జరుగుతోంది? హిమంత ఎలివేషన్ వెనుకున్న కారణాలేంటి?


దేశంలో ఏ మేజర్ ఇన్సిడెంట్ రాజకీయంగా ప్రస్తావనకు వచ్చినా అసోం పేరు వినిపిస్తోంది. నేతలెవరైనా, ఎక్కడైనా కాస్త వివాదాస్పదంగా మాట్లాడితే… అసోంలో కంప్లైంట్ ఇస్తే చాలు… పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి వాలిపోతున్నారు. అవును సీఎం హిమంత బిశ్వ శర్మ స్పీడ్ పెంచారు. చాలా విషయాల్లో ఇప్పుడు అసోం పేరు వినిపిస్తోంది. లేటెస్ట్ గా బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా అసోం అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దీని వెనుక ప్రమాదకరమైన అజెండా ఉందని, బీబీసీపై చర్యలు తీసుకోవాలన్నది ఆ తీర్మానం సారాంశం.

ఖలిస్తానీ లీడర్ అమృతపాల్ సింగ్ ముఖ్య అనుచరులంతా ఇప్పుడు అసోం జైలులో ఉన్నారు. ఎక్కడ పంజాబ్.. ఎక్కడ అస్సాం.. 2700 కిలోమీటర్ల దూరం. అయినా సరే అసోం జైలుకు షిఫ్ట్ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి పవన్ ఖేరా ఎపిసోడ్ అయినా, జిగ్నేష్ మేవానీ రీ అరెస్ట్ అయినా… మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు నడిచినప్పుడు షిండే వర్గానికి షెల్టర్ జోన్‌గా అసోం ఉంది. ఈ పరిణామాలన్నీ అసోం సీఎం హిమంత ఎలివేషన్ ను చూపుతున్నాయి. హైకమాండ్ ఆలోచనలకు తగ్గట్లుగా వ్యవహారం నడపడంలో హిమంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.


హిమంత బిశ్వ శర్మకు ఏ అసైన్‌మెంట్ ఇచ్చినా కచ్చితంగా పూర్తి చేస్తారని, అది ఎలాంటి ప్రొఫైల్ అయినా పని చేస్తారని ఆయన బయోగ్రఫీ రాసిన అజిత్ దత్తా అంటున్నారు. ప్రతికూలతలను అడ్వాంటేజ్‌గా మార్చుకునే కెపాసిటీ ఆయనకు ఉందంటున్నారు. ఢిల్లీ నుంచి అసోం భౌగోళికంగా చాలా దూరం. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి నేత ఉండడం ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. నిజానికి బీజేపీ పెద్దలు… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కంటే హిమంత బిశ్వ శర్మపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని చెబుతున్నారు.

గతంలో కాంగ్రెస్ లో పని చేసిన హిమంత… ఇప్పుడు నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలియెన్స్ కన్వీనర్ గా ఉన్నారు. ఈశాన్యంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే బీజేపీ వర్గాలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీబీసీకి వ్యతిరేకంగా అసోం అసెంబ్లీ తీర్మానం ఆమోదించడం వెనుక హిమంత దూకుడు స్వభావం అర్థం చేసుకోవచ్చు. బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా ఒక్క గుజరాత్ అసెంబ్లీ మాత్రమే తీర్మానాన్ని పాస్ చేసింది. అలాగే ఎన్నో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నా… అవేవీ ఈ అంశం జోలికి వెళ్లలేకపోయాయి. కానీ హిమంత మాత్రం ఈ ఇష్యూను అసెంబ్లీ తీర్మానంతో టచ్ చేశారు.

హిమంత బిశ్వ శర్మ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇప్పుడు కమలం పార్టీకి ట్రబుల్ షూటర్ గా మారి.. అధినాయకత్వం సమస్యలను తగ్గిస్తున్నారంటున్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం హిమంత బిశ్వ శర్మ చూపుతాడన్న నమ్మకం కేంద్రప్రభుత్వంలోని పెద్దల్లో ఉంటోంది. లేటెస్ట్ గా అమృత్ పాల్ సింగ్ మామ హర్ జీత్ సింగ్ సహా మరో ఆరుగురు అనుచరులను… అసోంలో హై సెక్యూరిటీ ఉండే దిబ్రూగఢ్ జైలులో ఉంచారు. వీరిని అసోం జైలుకే ఎందుకు పంపారన్న ప్రశ్నలకు ప్రభుత్వం అసలు సమాధానం ఇవ్వలేదు. అయితే ఇందులో చాలా వ్యూహాలు ఉన్నాయి. పంజాబ్‌కు అసోంకు 2700 కిలోమీటర్ల దూరం. పంజాబ్‌ లో అశాంతికి కారణమవుతున్న వారిని దూరంగా ఉన్న జైళ్లల్లో పెడితే కొంత సేఫ్ అని, ఖలిస్తానీ సానుభూతిపరుల మద్దతు దొరకడం కష్టమవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే దేశంలో ఎన్నో హై సెక్యూరిటీ జైళ్లు ఉన్నా కేంద్ర పెద్దలకు హిమంత బిశ్వ శర్మ మాత్రమే ట్రబుల్ షూటర్ గా కనిపించారు. అమృత్ పాల్ అనుచరులను హిమత కరెక్ట్ గా డీల్ చేస్తారని నమ్మడం వల్లే ఆరుగురినీ దిబ్రూగఢ్ జైలుకు షిఫ్ట్ చేశారంటున్నారు.

ఈ ఫిబ్రవరిలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా.. ప్రధాని మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. పలు రాష్ట్రాల్లో ఖేరాపై కంప్లైంట్స్ వచ్చాయి. అసోంలోనూ కంప్లైంట్స్ ఇవ్వగానే పోలీసులు పవన్‌ ఖేరాను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ విషయంపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పెద్ద వివాదమే నడిచింది. రన్ వే పై ఉన్న విమానం నుంచి దింపి మరీ పవన్‌ ఖేరాను అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఖేరా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

గతేడాది జులైలో మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు నడిచాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే రూట్ మార్చి ఎమ్మెల్యేలతో సహా అసోంలో క్యాంప్ పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 8 రోజుల పాటు అసోంలోనే వారంతా ఉండిపోయారు. ఈ టైంలో మహారాష్ట్రలో బీజేపీ-షిండే సేన ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీసింది. అప్పుడు కూడా హిమంత బిశ్వశర్మ కూడా ఏక్ నాథ్ షిండే సహా రెబెల్ ఎమ్మెల్యేలను కలిసి వచ్చారు. మరోవైపు ఏప్రిల్ 20, 2022న గుజరాత్‌కు చెందిన నేత జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌పై అసోంలో ఫిర్యాదు రావడం, అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. బెయిల్ పై బయటకు వచ్చినా మరో కేసులో రీ అరెస్ట్ చేశారంటే ఎంత సూపర్ ఫాస్ట్ గా హిమంత వ్యవహారాలు నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

హిమంత బిశ్వ శర్మ అసోం వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రజాదరణ పెంచుకుంటూ వస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. డ్యూటీలకు డుమ్మాకొట్టిన డాక్టర్లను సస్పెండ్ చేయించారు. కోవిడ్ టైంలో అసోం అంతా కలియదిరిగి ఏర్పాట్లను సమీక్షించారు. హిమంత బిశ్వ శర్మ గతం నుంచే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. బీజేపీలో చేరాక జాతీయస్థాయి నాయకుడిగా మారారు. 2019లో బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ట్రబుల్ షూటర్ గా పని చేశారు. హిమంత సీఎం అయ్యాక… అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ ప్రచారం చేశారు. హైదరాబాద్ లో గతేడాది గణేష్ నిమజ్జన ఉత్సవానికి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ టైంలో స్టేజ్ పైకి ఓ వ్యక్తి దగ్గరగా దూసుకొచ్చి మైక్ పక్కకు లాగేశాడు. దీంతో కేసీఆర్ కుటుంబ పాలనపై హిమంత విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించారు. దేశంలో హిమంత ఎక్కడికి వెళ్లినా జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు.

Related News

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

×