EPAPER

ARSI Baleshwar Suicide : ARSI బాలేశ్వర్ మృతి.. ఆత్మహత్యా ? మిస్ ఫైరా ?

ARSI Baleshwar Suicide : ARSI బాలేశ్వర్ మృతి.. ఆత్మహత్యా ? మిస్ ఫైరా ?


ARSI Baleshwar Suicide : హైదరాబాద్ లోని పాతబస్తీలో ARSIగా విధులు నిర్వహిస్తున్న బాలేశ్వర్ ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్. విధులలో భాగంగా ఆయన శనివారం మహబూబ్ నగర్ 10వ బెటాలియన్ నుంచి పాతబస్తీకి వచ్చారు. కబూతర్ ఖానాలో డ్యూటీ చేస్తున్న బాలేశ్వర్.. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Also Read : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్


ఆరునెలలుగా పాతబస్తీలోనే విధులు నిర్వహిస్తున్న బాలేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడటం తోటి ఉద్యోగులను షాక్ కు గురిచేసింది. డీసీపీ సాయిచైతన్య, చార్మినార్ ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలేశ్వర్ బలవన్మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఉగాది పండుగకు సెలవు మంజూరు చేయకపోవడంతోనే బాలేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చిన్న కారణానికే అతను ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక కుటుంబ కలహాలు, ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం ఆర్థికంగా ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నారు. గన్ మిస్ ఫైర్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెప్పారని , సోషల్ మీడియాలో మాత్రం సూసైడ్ అని చెబుతున్నారని వాపోయారు.

 

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×