EPAPER

Kondakal: ఫేక్ మనుషులు-ఫోర్జరీలు.. 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి

Kondakal: ఫేక్ మనుషులు-ఫోర్జరీలు.. 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి

ఆపరేషన్ కొండకల్ పార్ట్ 2


– కొండకల్ తండాలో విక్రమ్ దొర పాలన
– అంతా ఆయనేనంటూ గుడ్డిగా నమ్మిన గిరిజనులు
– అభివృద్ధి చేస్తానని ఆగం పట్టించాడని ఆగ్రహం
– కేటీఆర్ పేరు గట్టిగా వాడకం
– అపర్ణ కంపెనీలోకి ఉదయ్ కుమార్ వచ్చాకే లిటిగేషన్ భూముల్లో పెట్టుబడులు
– దొంగ పత్రాలతో 50 ఎకరాలు కొట్టేసిన వైనం
– ఫోర్టరీ, నకిలీ పత్రాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఖాకీలు
– ఫేక్ మనుషులతో రికార్డులు మార్చారని కోర్టు ఆదేశాలతో చివరకు కేసు నమోదు
– 3 నెలల క్రితం కేసును క్లోజ్ చేసిన పోలీసులు
– భూముల పైకి పట్టాదారులను రానివ్వకుండా ప్రైవేట్ సైన్యం
– వాటిని పర్యవేక్షించేందుకు ఏసీపీ, ముగ్గురు సీఐలు?
– హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోకుండా పనులు చేస్తున్న అపర్ణ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల. 9848070809


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కాస్ట్లీ ఏరియాలో భూముల్ని ఖతం పట్టిస్తున్న అపర్ణ కంపెనీ బండారాన్ని స్వేచ్ఛ – బిగ్ టీవీ బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విక్రమ్ రెడ్డి అన్నీ తానై 400 గిరిజన కుటుంబాలకు దొరగా ఉన్నాడు. ఇతని తాత జగ్గారెడ్డి దేశ్ ముఖ్ – సుభద్రబాయి నిజాం కాలంలో తాఖీదారులుగా ఉండేవారు. 2150 ఎకరాలకు ముక్కిపిండి పన్నులు వసూలు చేసి ఇచ్చేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో నర్సింహా రెడ్డిని దత్తతగా తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు విక్రమ్ రెడ్డి దొర, విజయ్ కుమార్ రెడ్డి దొర. వీరిద్దరితో పాటు ఓ అమ్మాయి. విజయ్ కుమార్ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయాడు. విక్రమ్ రెడ్డికి శ్రీరామ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. వీళ్ల ఫ్యామిలీ హిస్టరీ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఊరంతా కబ్జా చేసి రూ.17 వేల కోట్ల స్కాంకి తెర తీశారు కాబట్టి. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమడ దూరంలో ఉండే కొండకల్ తండాలో ఈనాటికీ చదువురాని వారు 80శాతం ఉన్నారంటే దొర ఎలా పాలించారో అర్థం చేసుకోండి. 800 ఎకరాల్లో 50 ఎకరాలను దోచుకున్న తీరు ఈ ఆపరేషన్ కొండకల్ పార్ట్ 2లో చూద్దాం.

మనుషులనే మార్చేసి రికార్డుల మాయం

కొండకల్‌లో ఎక్కడైనా ఎకరం 10 కోట్ల దాకా పలుకుతోంది. ఊరంతా విక్రమ్ రెడ్డి దొర చేతిలో ఉంది. సీలింగ్ యాక్ట్ వచ్చినా భూములను దొంగ దారిన ఎలా రక్షించుకోవాలో రక్షించుకున్నారు. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో ఆర్‌ఓ‌ఆర్, సాదాబైనామాలు వచ్చినా రికార్డుల్లో ఆ ఏడాది రెండేళ్లే కబ్జాదారుని కాలంలో ఎక్కించి ఊరుకునే వారు. ఇలా 2150 ఎకరాల్లో కొంత మంది బంధువులకు అమ్మేసుకున్నారు. అందులోనే దూరపు బంధువు వేదురు సుదర్శనమ్మ, అరుంధతి రెడ్డిలకు ఇక్కడ 50 ఎకరాల భూమిని సీలింగ్ యాక్ట్ వస్తుందని తెలిసి అమ్మేశారు. సర్వే నెంబర్ 366, 367, 385, 386, 390లో రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మారాయి. 390లో 12 ఎకరాల భూమి క్లియర్‌గా సాగు చేసుకునే వారు. రామచంద్రారెడ్డి భార్యలు సుదర్శనమ్మ, అరుంధతి రెడ్డి. వారి వారసులకు ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలో వారి పేర్లపై చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో విల్ డీడ్ (డాక్యుమెంట్ నెంబర్ 32/ 1982. తేది-21-06-1982) చేశారు. అయితే తన భర్త రామచంద్రా రెడ్డి చనిపోయిన తర్వాతనే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. 2018లో ఈ ముగ్గురు కాలం చెల్లిన తర్వాత 2018లో ప్రొసీడింగ్ నెంబర్ బీ/2346/2018లో రెవెన్యూ రికార్డుల్లో 12 ఎకరాలకు సక్సెషన్ చేయించుకున్నారు. అయితే, 50 ఎకరాలకు మొత్తంగా మరో సులోచనమ్మను సృష్టించి 2002లో యూబీ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్స్‌కి అమ్మినట్లు సేల్ డీడ్ (డాక్యుమెంట్ నెంబర్ 5404/2002. తేదీ-29-06-2002) చేశారు. ఇందుకు సాక్షులుగా విక్రమ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఈ దొంగ పత్రాలు, ఫేక్ వ్యక్తులను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుని 2019లో మ్యూటేషన్ చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ (28879/2019) దాఖలైంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలతో 2019లో యూబీ హోమ్స్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని ఆదేశించింది. కానీ, అధికారం ఉండటంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అదే యూబీ కంపెనీ, అపర్ణ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ధరణి వచ్చిన తర్వాత అపర్ణ హోమ్స్‌కి అమ్మేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు హైకోర్టులో అపర్ణ సంస్థ అన్నింటి పైన కేసు వేసి రైతులను, అటు పట్టాదారులను కోర్టులో కేసు ఉందని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడి, మొత్తం 800 ఎకరాలకు గొడ పెట్టి ఊరంతా కబ్జా చేసి యుద్ధం ప్రకటించింది.

Also Read: Kadambari Jethwani: ఆ రోజు జరిగింది చెబుతూ.. పోలీసుల ముందు కాదంబరి కన్నీళ్లు, గుండె బరువెక్కడం ఖాయం!

ఏ ప్రభుత్వం ఉన్నా వాడకం ఒక్కటే

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిల పేర్లను వాడుకుని పోలీసుల సహకారాలతో గిరిజనులపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఓ మంత్రి పేరును గట్టిగా వాడుకుంటున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డికి ఆ మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. కోర్టు రిఫర్ కేసు అయిన ఎఫ్ఐఆర్ నెంబర్ 253/2023 ని మూడు నెలల క్రితం క్లోజ్ చేశారని తెలుస్తోంది. అటు బీఆర్ఎస్‌లో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పేర్లు వాడుకుంటూ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకుంటున్నారు. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి మామలు రవీందర్ రెడ్డి, లచ్చిరెడ్డి పోలీసులను మేనేజ్ చేయడంలో దిట్టగా మారారు. వనస్థలిపురంలో నివాసం ఉండే ఉదయ్ కుమార్ అనే ఏసీపీని ప్రైవేట్ సైన్యానికి మానటరింగ్ చేసేలా వాడుకుంటున్నారని తెలుస్తోంది. సింగరేణి కాలనీ గిరిజనుల గ్యాంగ్‌ని, సిక్కుల గ్యాంగ్‌ని తీసుకొచ్చి గొడవలు సృష్టించడంలో ఈ ఏసీపీతో పాటు మరో ముగ్గురు సీఐలు ఉన్నారని సమాచారం.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×