EPAPER
Kirrak Couples Episode 1

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్..
chota news

Chota News: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉషోదయ నగర్‌ పీహెచ్‌సీలో యూపీహెచ్ఎస్సీ షెడ్డును ప్రారంభించారు. అలాగే జీవన్ కల్యాణ్ నగర్, శారద నగర్‌లో వీడీసీసీ రోడ్డును, వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు రూ. 39.85 లక్షలు ఖర్చు అయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.


పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తమ నాయకుడికి షోకాజ్ నోటీస్ జారీ చేయకుండా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ.. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థి దశ నుంచి తనను కేసీఆర్ ప్రోత్సహించారని, ఇంతపెద్ద బాధ్యత తనపై పెట్టిన సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. ఈటల రాజేందర్ భారీగా డబ్బులు ఖర్చుపెట్టడంతో హుజూరాబాద్‌లో తాను ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.


కర్నూలు జిల్లా పత్తికొండలోని చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితులు నారాలోకేష్‌‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైసీపీ నేతలు తమ భూమిని ఆక్రమించి.. చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకూ ఎవరూ తమను పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

పోలీసులు చట్టప్రకారం బాధితులకు న్యాయం చేయకపోతే వారిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురం సర్పంచ్‌పై వార్డు వాలంటీర్ కత్తులతో దాడి చేస్తే పోలీసులు కేసును తారుమారు చేశారని అయ్యన్న ఆరోపించారు. బాధితుడికి న్యాయం జరగకపోతే కోర్టుకెళ్తానని హెచ్చరించారు.

నారా లోకేష్ పాదయాత్రలో దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలోనూ, సాక్షి దినపత్రికలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఫిర్యాదు చేశారు.

వేతనాలతో పాటు పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్లారు. వచ్చే నెల నుంచి వేతనాలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గోలవలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలాల్లో సంచరిస్తూ అరటి, జొన్న, పామాయిల్ పంటలను నాశనం చేశాయి. చేతికి అందాల్సిన పంటను నష్టపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

మెదక్ జిల్లా రామాయంపేటలో అనుమతులు లేకుండా ఇసుక డంపులను నిలువ చేసినట్లు గుర్తించిన మైనింగ్, రెవెన్యూ అధికారులు వాటిని సీజ్ చేశారు. సరైన అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసినట్టు డిప్యూటీ ఎమ్మార్వో స్వప్న తెలిపారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లె అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌లో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. జాబ్ మేళాలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నేతలు ఆయింట్‌మెంట్ జాబ్ మేళాలు నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ ఎద్దేవా చేశారు. కాలేజీ వారు నిర్వహించిన జాబ్ మేళాను.. వైసీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.

పెద్దపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి.. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపక వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో దారి దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పీఈఎస్ కాలేజీ విద్యార్థి దిలీప్‌ను గుర్తు తెలియని దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. విద్యార్థి వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌, డబ్బులను లాక్కుని నడుమూరు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దోపీడీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ తిరుపతి రాజీవ్ గాంధీ సర్కిల్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. దుగరాజ పట్నం పోర్టుతో పాటు మన్నవరం ఎలక్రికల్ ప్రాజెక్ట్, శ్రీకాళహస్తి-నడకుడి రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి 27 వరకు ‘పల్లె పల్లెకు సీపీఐ-ప్రజల వద్దకు సీపీఐ’ పేరుతో ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తెలిపారు. రేపు ఉదయం కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం నుంచి చైతన్య యాత్రను ప్రారంభిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు.

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో విషాదకర ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిపై రెండు కోతులు కొట్లాటకు దిగాయి. కోతుల ఘర్షణలో ఇటుక కిందపడి.. అటుగా వెళ్తున్న రఫీ అనే వ్యక్తి తలపై పడింది. తలకు బలమైన గాయం అవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇథనాల్ పరిశ్రమను జగిత్యాలలో కాకుండా.. సిరిసిల్లలో ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. విద్య సంస్థలు మీకు.. విష వాయువుల పరిశ్రమ మాకా? అని ప్రశ్నించారు. చక్కర కర్మగారాన్ని సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామంటూ కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ చిన్న వివాదం.. భారీ ఘర్షణకు దారి తీసింది. వాహనాన్ని తాకట్టు పెట్టి నగదు ఇచ్చే క్రమంలో వివాదం చెలరేగి.. 100 మంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్టుకున్నారు. ఇరువర్గాల ఘర్షణతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ చౌహాన్ తెలిపారు. ఎల్బీనగర్, చైతన్యపురి ఎస్‌ఓటీ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులు పట్టుపడినట్లు చెప్పారు. వారి నుంచి కోటిన్నర నగదును, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సందడి చేశాడు. తెలంగాణలో 38వ రాయల్ ఓక్ ఫర్నిచర్ స్టోర్ ప్రారంభోత్సవానికి నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రాయల్ ఓక్ స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నాడు. నిఖిల్‌ను చూసేందుకు అతడి అభిమానులు ఎగబడ్డారు.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×