EPAPER

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ అప్‌డేట్స్..

Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ అప్‌డేట్స్..
chota news

Chota News: ప్రధాని మోదీ రాకకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్-బేగంపేట మార్గాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్, ఎంపీ రేవంత్‌రెడ్డిల కోసం కుర్చీలు వేయడం ఆసక్తికరంగా మారింది. మోదీ కార్యక్రమానికి రానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి ఏరియాల్లో ఆందోళనలకు దిగింది బీఆర్ఎస్.


ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ అయ్యారు. ఒకే సారి 39 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలపాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్ సీఎస్ జీవో జారీచేశారు.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీరాజ్​ అవార్డుల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా ఎనిమిది అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది.

జగిత్యాల జిల్లా పోరండ్లలో భీమన్న జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మహబుబ్ నగర్ జిల్లాలో కల్తీకల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈత కల్లు తాగిన పది మంది పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. దొడ్లోనిపల్లి , కోయనగర్, మోతీ నగర్ కు చెందినవారిగా గుర్తించారు.

హైదరాబాద్ ఎల్బీనగర్ లో పేలుడు ధాటికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బండరాళ్లను పగలగొట్టడం కోసం పేలుడు పదార్థాలు వాడటంతో……భారీగా శబ్ధాలు వచ్చాయని కాలనీవాసులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న కాలనీలోని ఇళ్ల గోడలకు పగులు, ఇళ్లలో ఉన్న సామాగ్రి, టీవీలు ధ్వంసమయ్యాయని వాపోతున్నారు.

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బాబానగర్‌లో ఓ పాన్‌ షాప్‌లోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పిల్లపాళ్యం వద్ద బైకును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం సేవించి కారు నడిపాడని స్థానికులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు స్పందించలేదని వారితో వాగ్వాదానికి దిగారు.

సత్యసాయి జిల్లా జైమంగలి నదిలో ఏర్పాటు చేసిన ఇసుకరీచ్ రద్దు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు. ఇసుక రీచ్ వద్దకు వెళ్లిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హిందూపురం రూరల్ పీఎస్‌కు తరలించారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత భక్తుల దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తులు రెండున్నర కిలోమీటర్ల క్యూలైన్‌లో వేచి ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామమందిరం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని నిర్మాణ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న మగ చీతా ఒబాన్‌ని అధికారులు తిరిగి పార్కులో విడిచిపెట్టారు. నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకువచ్చిన 8 చీతాల్లో ఒబాన్ ఒకటి.

ట్విట్టర్‌ లోగోగా కుక్క స్థానంలో మళ్లీ పిట్ట వచ్చింది. మూడు రోజుల కిందట తమ సంస్థ లోగో అయిన బ్లూ బర్డ్‌ను తొలగించిన ట్విట్టర్​.. మళ్లీ కుక్క స్థానంలో మళ్లీ పిట్టను పునరుద్ధరించింది.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యే ప్రతి వార్తను పరిశీలించేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విభాగం అన్ని కోణాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను విశ్లేషిస్తుంది.

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా టిక్రీ కలాన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ గోడౌన్‌ కావడంతో మంటలు వేగంగా వ్యాప్తిం చెందాయి. 26 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఉక్రెయిన్‌లోని ప్రావిన్స్‌లపై రష్యా తీవ్రస్థాయిలో క్షిపణులు, రాకెట్ లాంఛర్లను ప్రయోగించింది. ఆయా ప్రాంతాల్లో పలు భవనాలు దెబ్బతినడంతో పాటు పలువురు మృతి చెందారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

లెబనాన్‌పై శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్, మరోవైపు గాజా స్ట్రిప్‌పైనా బాంబు దాడులు కొనసాగించింది. ముందు రోజు లెబనాన్ నుంచి తమ వైపు రాకెట్ దాడులు జరగడంతోనే ఈ వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన టాప్‌-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ పోలింగ్‌లో దాదాపు 12 లక్షల మంది ఓటు వేయగా, అందులో 4 శాతం ఓట్లు షారుఖ్‌కు దక్కాయి.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×