EPAPER

Anti Narcotic Bureau on Drugs: డ్రగ్స్ భూతంపై నార్కోటిక్స్ ఉక్కుపాదం.. ఇక మీ ఆటలు సాగవ్

Anti Narcotic Bureau on Drugs: డ్రగ్స్ భూతంపై నార్కోటిక్స్ ఉక్కుపాదం.. ఇక మీ ఆటలు సాగవ్

Anti Narcotic Bureau Report on Hyderabad Drugs: డ్రగ్స్.. ఇప్పుడు తెలంగాణలో నిత్యం వినిపిస్తున్న పేరు. గడిచిన కొన్నేళ్లుగా యంత్రాంగం మొద్దు నిద్రలో ఉండటంతో.. ఇప్పుడు పరిస్థితి చేజారిపోయిందా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్‌లో మైండ్ బ్లాంక్‌ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత దారుణమైన విషయాలేంటి అంటే.. స్కూళ్లకు కూడా ఈ మత్తుపదార్థాలు వ్యాపించాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు.


ఒకప్పుడు అందనంత దూరంలో ఉండేవి డ్రగ్స్. కొన్ని రోజుల క్రితం వరకు కేవలం పబ్స్‌లాంటి అల్ట్రా పాష్‌ ఏరియాలో మాత్రమే దొరికేవి. ఆ తర్వాత కాలేజీలకు చేరాయి.. ఇప్పుడు ఏకంగా స్కూల్స్‌లో కూడా ఈ డ్రగ్స్‌ కల్చర్ వచ్చేసింది. హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందులో గంజాయి నుంచి మొదలుపెడితే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ కూడా ఉన్నాయి.

ఉస్మానియా మెడికల్ కాలేజీ.. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ బాసర, సీబీఐటీ.. ఆఖరికి జగిత్యాల, చిట్యాలలాంటి మారుముల స్కూళ్లలో కూడా డ్రగ్స్‌ను గుర్తించారు పోలీసులు. అంతేకాదు ఈ కాలేజీస్, స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌కు బానిసైనట్టు తెలుసుకొని షాకయ్యారు.


Also Read : భాగ్యనగరంలో చాపకింద నీరులా డ్రగ్స్..పెడ్లర్లుగా మారుతున్న డీజేలు

ఆర్ట్రిస్ట్రీ పబ్బుల్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు..
కేవ్‌ పబ్బులో 33 మందికి డ్రగ్ టెస్టులో పాజిటివ్..
సింబయోసిస్ కాలేజీలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ 25 మంది విద్యార్థులు..
గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి సేవించిన 15 మంది విద్యార్థులు..
సీబీఐటీ కాలేజీలో ఒకరికి గంజాయి పాజిటివ్..
బాసర ట్రిపుల్‌ ఐటీలో డ్రగ్స్ బారిన పడ్డ పలువురు స్టూడెంట్స్..
ఇండస్ స్కూల్‌లో ఇ-సిగరేట్స్‌కు అలవాటు పడిన పలువురు విద్యార్థులు..
ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఆరుగురు జూనియర్ డాక్టర్లు..

ఇలా చదువుకుంటూ పోతే మీరు కంగారు పడతారు. అలా ఉంది మరీ ఈ లిస్ట్. ఇవన్నీ విన్నాక వెన్నులో కాస్త వణుకు పుడుతుంది. ఎందుకంటే మత్తుపదార్థాలు తెలంగాణలో ఇలా నరనరాన ఎలా ఇంజెక్ట్ అయ్యాయని ఆలోచనలో పడతారు.

ఈ రిపోర్ట్ మొత్తం చదివాక ముఖ్యంగా కంగారు పెట్టే విషయం ఏంటంటే.. స్కూల్స్‌కు ఈ కల్చర్ చేరడం. అందుకే నార్కోటిక్ బ్యూరో ఇకపై స్కూల్స్‌పై కూడా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా కార్పొరేట్, ప్రముఖ స్కూల్స్‌లో ఈ కల్చర్ ఎక్కువగా పాకినట్టు తెలుసుకున్నారు అధికారులు. అందుకే ఇకపై స్నిఫర్‌ డాగ్స్‌తో చెక్‌ చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు.. స్కూల్స్‌లో డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై హైస్కూల్స్‌లో ప్రహరీ క్లబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. టీచర్స్, పేరెంట్స్, పోలీసులు, స్టూడెంట్స్‌తో కలిపి క్లబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Also Read : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడికి పాజిటివ్.. కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరు..!

బాసర ట్రిపుల్ ఐటీకి అసలు గంజాయి ఎలా చేరుతుందన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి సరఫరా అవుతున్నట్టు గుర్తించి లింక్స్‌ను కట్ చేశారు. నిజానికి ఈ ఆపరేషన్‌ కొన్ని రోజులుగా జరుగుతుంది. కానీ స్టూడెంట్స్‌ ఫ్యూచర్‌ను దృష్టిలో ఉంచుకొని చాలా సీక్రెట్‌గా ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

ఇకపై తాము ఎవరిని ఉపేక్షించేది లేదంటున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. స్కూల్స్, కాలేజీలు, పబ్స్‌, ఎస్పెషల్‌గా డీజేలపై ఇక నుంచి నిఘా మరింత పెంచనున్నారు. ముఖ్యంగా మద్యం నుంచి మొదలు పెట్టి గంజాయి, డ్రగ్స్‌ వరకు సప్లై చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. ఇప్పటికే స్టేట్‌వైడ్‌గా హాట్‌స్పాట్స్‌ను గుర్తించిన అధికారులు.. అన్నింటిపై నిఘా పెంచారు. అదే సమయంలో.. డ్రగ్స్‌ మూలాలను కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో.. రెండు వైపుల పదనున్న కత్తిలా పనిచేస్తోంది ఇప్పుడు నార్కోటిక్ బ్యూరో. ముందు డ్రగ్స్‌ అసలు స్టేట్‌లోకి ఎంటర్‌ కాకుండా చర్యలు తీసుకుంటూనే.. అసలు వీటి జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×