EPAPER

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!

IAS Officer Amoy Kumar: అమోయ్ కుమార్ కు మరో షాక్ తగిలింది. మాజీ సీనియర్ కలెక్టర్‌పై మరో భూకుంభకోణం ఫిర్యాదు తెరపైకి వచ్చింది. సుమారు రూ.1000 కోట్ల విలువ చేసే ల్యాండ్‌ని అమోయ్ కుమార్ దోచేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ఇక మరో వైపు రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని వట్టినాగుల వల్లి, కాజాగూడా లోని పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అన్యాయంగా అప్పగించారని ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై బాధితులు ఆరోపిస్తున్నారు.


మొత్తం నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూరూలేగా అమోయ్ కుమార్ ల్యాండ్ కేటాయింపు జరిపాడని బాధితులు చెబుతున్నారు. ఈ ల్యాండ్ కబ్జాల వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ల్యాండ్ కబ్జాల ద్వారా లబ్ధి పొందిన డబ్బంతా ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో విచారణ జరుగుతుంది. మరోవైపు తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తట్టి అన్నారం గ్రామానికి చెందిన బాధితులు స్పష్టం చేశారు. 40 ఏళ్ల క్రితం డిక్రీ పేరుతో పెద్దలకు కట్టబెట్టాలని చూడటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సహాయంతో పెద్దలు కూడా బడా పారిశ్రామిక నేతలు నిరుపేదల భూములను కబ్జా చేయడం సరికాదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Also Read: కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ.. నాయస్థానం కీలక వ్యాఖ్యలు


ఈ తరుణంలో మధురానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో ఏ ఓ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం కలక్టరేట్ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. ఈ తరుణంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తట్టి అన్నారం గ్రామంలోని సర్వే నెబర్లు 108, 109, 110, 111 లోని 70 ఎకరాల 39 గుంటలు భూమి పట్టాదారు మద్ది సత్యనారాయణ రెడ్డి 1982 లో సుమారు 840 భూములతో వెంచర్ చేసి ఫ్లాట్ లను అమ్మినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి భూములను కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంబంధిత  అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకుని బాధితులకు  వారి ఫ్లాట్ లను అప్పజెప్పాలని ఆయన కోరారు. వారికి న్యాయం జరగకపోతే బాధిత కుటుంబ సభ్యులతో కలిసి 3000 మందితో కలెక్టర్ కార్యాలయం చుట్టూ నిరసనలు తెలుపుతామని లక్ష్మారెడ్డి  హెచ్చరించారు.

గురవారం నాడు ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.. నిన్న ఉదయం ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు అమోయ్‌ కుమార్‌ను ప్రశ్నించారు. మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని 42 ఎకరాల భూదాన్‌ భూమి రికార్డులపై అమోయ్‌ను కశ్చన్‌ చేశారు. భూదాన్‌ భూములపై రియల్టర్లను పిలిపించి..ఆరా తీస్తున్నారు. భూముల రికాడ్స్‌తో ఈడీ ఎదుట రియల్టర్లు హాజరయ్యారు. అమోయ్‌ కుమార్‌, రియల్టర్లను ఒకే దగ్గర ఉంచి ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే..

Related News

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

CP CV ANAND : ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు, ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్

Deputy CM Bhatti: ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్‌తో భేటీ, కుల గణన సర్వేపై

KTR Vs Konda Surekha: అలా మాట్లాడొద్దు.. కొండా సురేఖకు కోర్టు ఆదేశాలు

Ponds beautification: హైడ్రా టార్గెట్ ఫిక్స్.. ఫస్ట్ ఫేజ్‌లో నాలుగు చెరువుల సుందరీకరణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీ నేతలకు టాస్క్ రెడీ.. నిరూపించుకుంటే పదవులు ఖాయం

Big Stories

×