EPAPER

Anjani Kumar : తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు..

Anjani Kumar : తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు..

Anjani Kumar : తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏసీబీ డీజీగా ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్‌.. పాట్నా సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించారు. ట్రైనింగ్ లో మంచి ప్రతిభ చూపించి రెండు కప్పులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ లోనూ ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. ఐక్యరాజ్యసమితి శాంతి మెడల్ రెండుసార్లు అందుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకుగానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.


1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు రాష్ట్ర విభజన తర్వాత అంజనీకుమార్‌తో కలిపి మొత్తం 21 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు డీజీపీలు/ఇన్‌చార్జి డీజీపీలుగా పనిచేశారు. వారిలో 13 మంది నగర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. అనురాగ్‌ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా సిటీ కమిషనరేట్‌ నుంచి డీజీపీ అయ్యారు. ఏకే మహంతి రోడ్‌ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవింద్ రావు, ప్రసాదరావు అవినీతి నిరోధక శాఖకు చీఫ్‌లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంజనీకుమార్‌ కూడా అదే విధంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ/ఇన్‌చార్జి డీజీపీలుగా నియమితులైన ముగ్గురూ హైదరాబాద్ సిటీ కమిషనర్లుగా పని చేసిన వారే కావడం విశేషం.

అంజనీ కుమార్‌ కెరీర్…
1992లో జనగామ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అంజనీకుమార్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. 2003 వరకు సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, అనంతరం రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీగా, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీగా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్‌ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. 2021 డిసెంబర్ 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.


2026లో పదవీ విరమణ
రాష్ట్ర‌ డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్‌ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్‌ ముందువరుసలో ఉన్నారు. 2026 జనవరిలో అంజనీకుమార్ పదవీవిరమణ చేయనున్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×