EPAPER

Alleti Maheshwar Reddy: ఎట్టకేలకు బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక.. ఏలేటి మహేశ్వరరెడ్డికి ఛాన్స్..

Alleti Maheshwar Reddy: ఎట్టకేలకు బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక.. ఏలేటి మహేశ్వరరెడ్డికి ఛాన్స్..
Alleti Maheshwar Reddy news

BJP Legislative Party Leader(Telangana politics): ఎట్టకేలకు బీజేపీ శాసనసభా పక్ష నేతను ఆ పార్టీ ఎంపిక చేసింది. శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డికి బాధ్యతలు అప్పగించింది. మహేశ్వరరెడ్డిని బీజేఎల్పీ నేతగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియమించారు. బీజేఎల్పీ ఉప నేతలుగా పాయల్ శంకర్‌, వెంకటరమణారెడ్డికి అవకాశం కల్పించారు. బీజేపీ శాసనమండలి పక్ష నేతగా ఏవీఎన్‌ రెడ్డిని ఎంపిక చేశారు.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఎవరిని శాసనసభా పక్ష నేతగా నియమిస్తారనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత బీజేపీ పక్షనేతను ఎంపిక చేస్తారని భావించారు. కానీ బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

బీజేపీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీనియర్. ఆయన 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయననే బీజేఎల్పీ నేతను చేస్తారని ప్రచారం జరిగింది. 2023 ఎన్నికల ముందు వరకు రాజాసింగ్ ను కొంతకాలం పార్టీ సస్పెండ్ చేసింది. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీ అధిష్టానం తనను తిరిగి పార్టీలోకి తీసుకుంటుందని వేచి చూశారు. రాజాసింగ్ భావించిన విధంగానే కాషాయ పెద్దలు ఆయనపై కరుణ చూపారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ముచ్చట మూడోసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయనకు బీజేఎల్పీ నేత బాధ్యతలు మాత్రం అప్పగించకపోవడాన్ని కారణమేంటనే చర్చ జరుగుతోంది.


Read More:

నిర్మల్ నుంచి గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. చాలా కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆయన .. అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక విషయంలో తొలి నుంచి ఆయన పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ నేత ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ పెద్దలు భావించారు.

కామారెడ్డి నుంచి గెలిచిన వెంకటరమణారెడ్డి పేరు కూడా బీజేఎల్పీ నేత ఎంపికలో పరిశీలనలోకి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ పై గెలిచిన ఆయనకే శాసనసభ పక్ష నేత పదవి ఇవ్వాలనే చర్చ జరిగింది.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×