EPAPER

BRS: బీఆర్ఎస్‌తో బంధం తెగిందా? అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రశ్నలు

BRS: బీఆర్ఎస్‌తో బంధం తెగిందా? అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రశ్నలు

Asaduddin Owaisi: మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటూ వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి కూడా మంచి స్నేహం ఉన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీతో సయోధ్య కుదుర్చుకునే పద్ధతిని మజ్లిస్ పార్టీ అవలంబించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే మజ్లిస్ పార్టీ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉంటూ వచ్చింది. మొన్నటి వరకూ బీఆర్ఎస్‌తో సఖ్యంగానే మెలిగింది. కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం అందించినా మజ్లిస్ పార్టీ మాత్రం సస్పన్స్‌లోనే పెట్టింది. కానీ, తాజాగా ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలు, బీఆర్ఎస్ పార్టీపై వేసిన ప్రశ్నలు చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిందా? అనే అనుమానాలు రాకమానవు.


గత కొన్ని రోజులుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. బిడ్డ కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ పెద్దలతో డీల్ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్ కోసం కేటీఆర్, హరీశ్ రావులు స్వయంగా ఢిల్లీకి వెళ్లారని, సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, ఈ ఒప్పందంలో భాగంగా త్వరలోనే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లుతారనే ప్రచారం కూడా జరిగింది. పలు మీడియా సంస్థలు ప్రముఖంగా వార్తలనూ ప్రచురించాయి. ఈ వార్తలను పేర్కొంటూ అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ పై ప్రశ్నలు కురిపించారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చాయని, వాటిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీలో విలీనం అవుతుందా? లేక బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకుంటుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు మీడియాలో వస్తున్నాయని, కాబట్టి, వీటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీపై ఉన్నదన్నారు.


Also Read: రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. సీఎం కీలక ఆదేశాలు

రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ బీజేపీ, ఎంఐఎం ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంటున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం బరిలో నిలబడుతున్నది. తరుచూ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మతపరమైన అంశాల్లో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదించుకుంటాయి. కాబట్టి, ఒక వేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో జతకడితే.. కారు పార్టీకి దూరం జరిగే అవసరత ఎంఐఎం పార్టీకి ఏర్పడుతుంది. ఈ తరుణంలోనే అసదుద్దీన్ ఒవైసీ ఈ కీలక ప్రశ్నలను లేవదీసినట్టు అర్థం అవుతున్నది. ఎంఐఎంతో సత్సంబంధాన్ని కొనసాగించుకోవాలనుకుంటే, మీడియాలో వస్తున్న విలీన వార్తలు అవాస్తవాలే అయితే బీఆర్ఎస్ ఇది వరకే ఎంఐఎం పార్టీకి స్పష్టత ఇచ్చి ఉండేది. కానీ, అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా మీడియాలో ఈ అనుమానాలు లేవనెత్తడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక అవగాహన ఎంతోకాలం కొనసాగేలా లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Jammu Kashmir Elections: కశ్మీర్ ఎన్నికలు.. కమలానికి అగ్నిపరీక్షే..

Why Atishi as Delhi CM: సీఎంగా అతిశీనే ఎందుకు? కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి?

Amaravati: అమరావతి సేఫ్.. ఇక దూసుకుపోవడమే

Arvind Kejriwal Resignation: కేజ్రీ కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Arvind Kejriwal: అరవింద్ ‘క్రేజీ’వాల్.. బీజేపీకి చుక్కల్!

Big Stories

×