EPAPER

T-Congress Manifesto: తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు!

T-Congress Manifesto: తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు!

T-congress Manifesto Released for Lok Sabha Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మేనిఫెస్టో కన్వీనర్ ప్రో. జానయ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


5 న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేక హామీలు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాజీపేటలో రైల్వే కోచ్, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా, హైదరాబాద్ లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, 4 కొత్త సైనిక స్కూళ్లు, నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు, హైదరాబాద్ కు ఐటీఐఆర్ పాజెక్టు పునఃప్రారంభం, హైదరాబాద్ – విజయవాడ హైవే పక్కనుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ, ప్రతి ఇంటికి సౌరశక్తి, రామగుండం – మణుగూరు ప్రత్యేక రైల్వే లైన్, హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చింది.

Also Read: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..


అలాగే రాష్ట్రంలో మరిన్ని కేంద్రీయ విద్యాలయాలను, నవోదయ విద్యాలయాలను, జాతీయ క్రీడ విశ్వవిద్యాలయం ఏర్పాటు, నూతన ఎయిర్ పోర్టుల కట్టడాలు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)ఏర్పాటు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) క్యాంపస్ ఏర్పాటు, ఐసీఎంఆర్, 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ సర్పంచులకు బదిలీ అయ్యేలా చేస్తామని ప్రత్యేక హామీల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్ – బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అలాగే ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ హబ్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, డ్రై పోర్టు ఏర్పాటు, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

Also Read: CM Revanth Reddy: కారు కార్ఖానాకు పోయింది.. ఇక తూకం కింద అమ్ముకోవాల్సిందే: సీఎం రేవంత్

congress manifesto for telangana
congress manifesto for telangana
congress manifesto for telangana
congress manifesto for telangana

Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×