Aghori Arrest: అఘోరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరి. ఈ నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అఘోరి స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు అక్కడకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొన్నిరోజులుగా పర్యటిస్తున్నారు అఘోరి. ఇందులో భాగంగా తెలంగాణలో వేములవాడ, కొండగట్టు, ముత్యాలమ్మ ఆలయాలను సందర్శించారు. మహిళా అఘోరాలు ఎలా ఉంటారు? ఏం తింటారు? వారి దినచర్య ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది. అఘోరి స్వస్థలం తెలంగాణ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
అఘోరిపై పలు ఆరోపణలు లేకపోలేదు. వాటిపై అఘోరి తీవ్రంగా హెచ్చరించారు. ఇదే సమయంలో అనూహ్యంగా కేదార్‌నాథ్‌లో ప్రత్యక్షమయ్యారు. రెండ్రోజుల తర్వాత మళ్లీ తెలంగాణలో కొండగట్టు ఆలయానికి వచ్చారు. తర్వాత వేములవాడ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నుంచి కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించారు.
ALSO READ: తెలంగాణలో మయోనైజ్‌ని ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
అఘోరి అనూహ్యంగా ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడం కలకలం రేపింది. తొలుత సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పారు. తన గురువు ఆదేశాలతో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.