Big Stories

ABVP Leaders Arrest : టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. రంగంలోకి పోలీసులు

ABVP Leaders Protest at TGPSC : టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘం ప్రయత్నించింది. ఖాళీగా ఉన్న 25 వేల ఉద్యోగాలతో ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తి కింద అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరసనకారులు కోరారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలనే డిమాండ్లు పెట్టారు.

- Advertisement -

టీజీపీఎస్సీ భవనాన్ని ముట్టడించేందుకు ఏబీవీపీ పిలుపునివ్వడంతో.. భారీ సంఖ్యలో నిరసనకారులు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. గ్రూప్, 2,3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ భవనాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఏబీవీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచేంతవరకూ తాము ఉద్యమిస్తామని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ వెల్లడించారు.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News