EPAPER

Jogulamba gadwal: పొలంలో మొసలి ప్రత్యక్షం, ఖంగుతిన్న కూలీలు

Jogulamba gadwal: పొలంలో మొసలి ప్రత్యక్షం, ఖంగుతిన్న కూలీలు

A crocodile is seen in the farm, and the laborers are upset: మొసలి.. దీని శరీరం అంతా వికారంగా.. పొలుసులను కలిగి ఉంటుంది. ఇక దీని శక్తిని చూడాలంటే నీటిలోకి దిగాలి. దాని బలం ఎంత ఉంటుందంటే ఒక ఏనుగును లాగి అవతల పడేసే అంత కలిగి ఉంటుంది. అంతేకాదు నీటిలో ఉన్నప్పుడు దానిని ఆపడం ఎవరితరం కాదు. అంతలా తన బలాన్ని కలిగి ఉంటుంది. అలాంటిది అది నీటి నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది. ప్రాణం పోయి వచ్చినట్టు ఉంటుంది. అచ్చం అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అయింది. ఇంతకీ ఇదెక్కడ జరిగింది అనుకుంటున్నారా.. అయితే అదెక్కడో తెలియాలంటే పుల్‌ డీటెయిల్స్‌ తెలుసుకోవాల్సిందే.


జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక పత్తి పొలంలో మొసలి ప్రత్యక్షం అవడంతో అందరూ కంగారు పడ్డారు. ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారికి షాక్ అయ్యారు. దాంతో భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న జమిందార్ పురేందర్ కానిస్టేబుల్ నిరంజన్ అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్, పార్టీలో మార్పులు చేర్పులు!


భారీ వర్షాలకు చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంగారుపడకుండా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించిన తీరును అటవీశాఖ అధికారులు కొనియాడారు. అంతేకాదు పనులకు వెళ్లేటప్పుడు ప్రజలు, కూళీలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×