EPAPER
Kirrak Couples Episode 1

1969 Telangana Movement : 1969 జనవరి 9.. తొలి తెలంగాణ ఉద్యమానికి 55 ఏళ్లు..!

1969 Telangana Movement :  1969 జనవరి 9.. తొలి తెలంగాణ ఉద్యమానికి 55 ఏళ్లు..!

1969 Telangana Movement : 1956 నవంబరు 1న, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలు, రక్షణలను పూర్తిగా విస్మరించటంతో తెలంగాణలో మొదలైన అసంతృప్తి.. క్రమంగా తొలి తెలంగాణ పోరాటంగా మారింది. ఖమ్మం జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం తెలంగాణ అంతా వ్యాపించి, తమ హక్కుల సాధనకు మాధ్యమంగా నిలవటమే గాక మలిదశ తెలంగాణ పోరాటానికి ప్రాతిపదిక అయింది. ఈ ఉద్యమం ప్రారంభమై 55 ఏళ్లైన సందర్భంగా నాటి ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలను తెలుసుకుందాం.


1969 జనవరి 5 : పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పాల్వంచలోని థర్మల్​ పవర్​ ప్లాంట్​లో ఆంధ్రోళ్లకే ఎక్కువ ఉద్యోగాలిచ్చారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగుల నిరసన.
జనవరి 9 : తాను ముల్కీ అయినా.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ బీఏ స్టూడెంట్, విద్యార్థి నేత రవీంద్రనాథ్​.. ఖమ్మం గాంధీచౌక్​ దగ్గర దీక్షకు దిగగా, నాటి ఖమ్మం మున్సిపాలిటీ నాటి ఉపాధ్యక్షుడు, కవి.. శ్రీర కవి రాజమూర్తి కూడా పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటు.
జనవరి 10 : విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగటంతో నిజామాబాద్, ఉస్మానియా యూనివర్సిటీకి పాకిన ఉద్యమ నిరసనలు.
జనవరి 13 : ఓయూలో ‘తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి’ ఏర్పాటు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా విద్యార్థుల తీర్మానం. అదే రోజు పలువురు ప్రముఖులు కలిసి ‘తెలంగాణ పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
జనవరి 20 : శంషాబాద్‌లో ఉద్యమంలో పాల్గొన్న స్కూలు విద్యార్థులపై కాల్పులు.
జనవరి 24 : ఉద్యమంలో పొల్గొన్న విద్యార్థులపై సదాశివపేటలో పోలీసుల కాల్పులు. కాల్పుల్లో 14 మందికి గాయాలు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భీమన్‌పల్లి శంకర్ అనే విద్యార్థి మృతి. తెలంగాణ కోసం ప్రాణం కోల్పోయిన అమరుడిగా గుర్తింపు.
జనవరి 27 : నల్లగొండలో రంగాచార్యులు అనే ఆంధ్రా ఉద్యోగిపై కొందరు పెట్రోల్ పోసి, అంటించి హత్య చేశారు. దీంతో సీమాంధ్రలో జీవో 36 వెనక్కి తీసుకోవాలనే ఆందోళనలు ప్రారంభం
ఫిబ్రవరి 28 : యువకులు, మేధావులు కలిసి హైదరాబాద్‌లో ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు
మార్చి 29 : నాన్ ముల్కీలను వెనక్కి పంపటం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు విడుదల, తీర్పును ఖండిస్తూ మంత్రి కొండా లక్ష్మణ్​ బాపూజీ రాజీనామా, తెలంగాణ కాంగ్రెస్​ సమితిని ఏర్పాటు చేసి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు
ఏప్రిల్​ 12 : ఉద్యమకారులను శాంతింపజేసేందుు 8 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ
1969 మే 20 : ఉస్మానియా వర్సిటీలో వీసీ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో తొలిసారి ప్రొ. జయశంకర్‌ నాగార్జున సాగర్‌ నీటి పంపకంపై తన పరిశోధన ప్రతిని సమర్పించారు.
జూన్​: ఈ నెల అంతా ప్రత్యేక తెలంగాణ కోసం సమ్మెలు, బంద్‌లు జరిగాయి.
1969 జూన్‌ 6 : కాళోజీ అధ్యక్షతన తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు
జూన్ 10 : తెలంగాణ ప్రాంత ఉద్యోగులంతా సమ్మెకు పిలుపునిచ్చారు. 36 రోజుల పాటు సాగిన సమ్మె
జూన్​ 24 : ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా వచ్చి, నేతలందరితో చర్చలు జరిపారు.
జూన్ 25 : హైదరాబాద్‌లో ఉద్యోగుల సమ్మె.
జూన్ 27 : అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా.
ఆగస్టు 18 : లోక్‌సభలో తెలంగాణ ప్రాంత ఎంపీలు కాకా జి. వెంకటస్వామి, జి.ఎస్. మేల్కోటే ప్రత్యేక తెలంగాణ నినాదాలు
సెప్టెంబర్ ​25 :
టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతిని కలిసిన కొండా లక్ష్మణ్​ బాపూజీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై వినతి
నవంబర్​26 : ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు మర్రి చెన్నారెడ్డి ప్రకటన.
1970 డిసెంబర్​10 : ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవేనంటూ ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పు.
1973 సెప్టెంబర్ 21: తెలంగాణ, ఏపీ ప్రాంతాల నేతల మధ్య ఆరు పాయింట్ల ఫార్ములాపై ఒప్పందం.
1985 డిసెంబర్​ 30 : జోన్ల వారీగా ఉద్యోగులను కేటాయించేందుకు జీవో 610 విడుదల


Related News

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Big Stories

×