EPAPER

Bharat Jodo Yatra : 50వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra : 50వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 50వ రోజుకు చేరింది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో రాహుల్ పాదయాత్ర పూర్తి చేశారు. తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ ఆ తర్వాత కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ను చుట్టేశారు.
రాహుల్ చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమానికి సామాన్యుల నుంచి రోజు రోజుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ప్రజలు రాహుల్ దృష్టికి తమ సమస్యలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే దాదాపు మూడో వంతు పాదయాత్ర పూర్తి చేశారు. 4 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో పాదయాత్ర చేశారు.


ప్రస్తుతం తెలంగాణలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది నేతలు రాహుల్ తోపాటు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. రాష్ట్రంలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు మునుగోడు ఉపఎన్నికలో పార్టీ విజయం కోసం పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. మరోవైపు రాహుల్ పాదయాత్ర సూపర్ సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేతలందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 31న శంషాబాద్ లో రాహుల్ గాంధీ ప్రత్యేక మీడియా సమావేశం ఉంది. నవంబర్ 4న పాదయాత్రకు బ్రేక్ తీసుకుంటారు. ఆ రోజంతా కంటైనర్ లోనే రాహుల్ రెస్ట్ తీసుకుంటారు. 2023 ఫిబ్రవరి నాటికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగుస్తుంది.

భారత్ జోడో యాత్ర 50 రోజులకు చేరిన సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్… కన్యాకుమారిలో తొలి రోజు నుంచి రాహుల్ యాత్ర సాగిన తీరు వీడియో రూపంలో ప్రదర్శించారు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఇంత సుదీర్ఘ యాత్ర చేపట్టలేదని అన్నారు. నిత్యం వందల మంది ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ సామరస్యంగా వింటున్నారని తెలిపారు. ఇది ఒక లెర్నింగ్, లిజనింగ్ యాత్రగా జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇదే సమయంలో జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్షాల ఐక్యత ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఎవరైనా కాంగ్రెస్ తో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. పార్టీ నేతలకు జైరాం రమేష్ కీలక సూచనలు చేశారు. జోడో యాత్ర ప్రభను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పీసీసీ, డీసీసీ, బీసీసీల మీదే ఉందన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఆపరేషన్ లోటస్ చోడో.. భారత్ జోడో నినాదంతో రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పాదయాత్ర దేశ రాజకీయాల్లో సంచలన మార్పులు రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×