EPAPER

AP&TS Road Accidents : నెత్తురోడిన రహదారులు.. నలుగురు మృతి

AP&TS Road Accidents : నెత్తురోడిన రహదారులు.. నలుగురు మృతి
Road Accidents in AP & TS
andole road accident

Road Accidents in AP & TS(Today’s news in telugu): తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలో సోమవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. డాకూర్ శివారులో.. రోడ్డుపై నిలబడి ఉన్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు జోగిపేటకు చెందిన ముకురం (22), హాజీ (26), వాజీద్ (28)లుగా గుర్తించారు.


Read More : కీలక మలుపులు తిరుగుతున్న రాడిసన్ డ్రగ్స్‌ కేసు.. సెలబ్రిటీలపై కేసులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. కంభం – గిద్దలూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కంభం మండలం జంగం గుంట్ల సమీపంలో.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సైదాపురం గ్రామానికి చెందిన కొట్టే రాఘవేంద్ర (45)గా గుర్తించారు.


యువతి అనుమానాస్పద మృతి

భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ కి చెందిన బొనగాని స్వాతి (21) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి బాలలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పనులు ముగించుకొని ఇంటికి రాగానే తన కూతురు మృతి చెందిందని బోరున విలపిస్తూ చెప్పింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మృతిపై అనుమానం ఉన్నట్లు తెలిపింది. స్వాతి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై నాగరాజు తెలిపారు.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×