EPAPER

SNIFFER DOGS: తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా 36 స్నిఫర్ డాగ్స్

SNIFFER DOGS: తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా 36 స్నిఫర్ డాగ్స్

SNIFFER DOGS: బెల్జియం జాతికి చెందిన స్నిఫర్‌ డాగ్స్‌ తెలంగాణ పోలీస్‌ శాఖకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో….. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్నాయి. 48 స్నిఫర్‌డాగ్స్‌కు ఇక్కడ ఎనిమిది నెలలపాటు కఠోర శిక్షణనిచ్చారు.


వీటిలో 21 బెల్జియం మిలోనెస్‌ జాతికి చెందిన శునకాలున్నాయి. మరో 21 లెబ్రడాల్‌, ఒకటి జర్మన్‌ షెప్పర్డ్‌, నాలుగు కోకర్‌ స్పానియల్‌ జాతికి చెందినవి ఉన్నాయి. గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన ఒక శునకం ఉంది. 36 స్నిఫర్‌డాగ్స్‌ తెలంగాణ పోలీసు శాఖకు, మిగతా 12 అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులకు చెందినవి.

ఇంతకముందు తెలంగాణ పోలీసులు… లెబ్రడాల్‌, డాబర్‌మెన్‌, ఆల్సీషియన్‌, గోల్డెన్‌ రిట్రీవర్‌, డాల్మేషన్‌, జర్మన్‌షెపర్డ్‌ కుక్కల సేవలు వినియోగించుకుంది. ఇప్పుడు బెల్జియం మిలోనెస్‌ జాతికి చెందిన శునకాలను తన సైన్యంలో చేర్చుకుంది.


బాంబులను, పేలుడు పదార్థాలను గుర్తించడానికి శునకాలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ శునకాలకు మొదటి దశ శిక్షణలో హ్యాండ్లర్ చెప్పినట్లు వినేలా నేర్పించారు. రెండోదశలో బాంబులు, పేలుడు పదార్థాలు గుర్తించేలా తయారు చేశారు.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×