EPAPER

TS Intermediate Exams : రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. 144 సెక్షన్ అమలు

TS Intermediate Exams : రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. 144 సెక్షన్ అమలు

ts intermediate exam


Intermediate Exam from tomorrow(TS news updates): రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 576 పరీక్ష కేంద్రాల్లో 4,54,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పర్యవేక్షణ కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంట్‌ అధికారి ఉంటారు.

జిల్లాల్లో కూడా పరీక్షల కమిటీ, హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.


Read More:  మహబూబ్ నగర్ MLC ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

పరీక్షలు ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని విద్యార్థలకు అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. రాష్ర్టవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,44,189 మందితో మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం ప్రాథమిక వైద్య సదుపాయాలతో పాటు ఒక నర్సును కూడా అందుబాటులో ఉంచేలా అధికారులు నిర్ణయించారు. పరీక్ష హాల్‌ సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ వస్తవులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×